మహారాణి ఆశీర్వాదం వల్లే.. వైరల్ అవుతున్న దీపికా పదుకొనె ఫోటో!
టెంపర్ హిందీ రీమేక్ చిత్రం సింబా సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికి ఈ చిత్రం 200 కోట్ల మార్క్ కు చేరువైనట్లు తెలుస్తోంది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ ఛితంలో రణవీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా నటించారు. రణవీర్ సింగ్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నిర్మాత కరణ్ జోహార్ తన నివాసంలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది.
కాగా పార్టీలో ఓ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు రోహిత్ శెట్టి, రణవీర్ సింగ్ దీపికకు వంగి నమస్కరిస్తుడగా ఆమె వీరు ముగ్గురిని ఆశీర్వదిస్తుంది. ఈ ఫోటోని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్గా మారింది. రాణి పద్మావతి ఆశీస్సులతో ఈ చిత్రం విజయం సాధించిందని కరణ్ జోహార్ క్యాప్షన్ పెట్టారు. ఇది నెటిజన్లని తెగ ఆకర్షిస్తోంది.

రోహిత్ శెట్టి బాలీవుడ్ లో కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రానికి హిందీ నేటివిటీకి అనుగుణంగా మార్చి రూపొందించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కామియో రోల్ పోషించారు.


Click it and Unblock the Notifications











