600 కోట్ల సినిమాలు ముఖ్యం కాదు.. ‘కల్కి-2' వివాదంపై దీపికా పదుకొణె రియాక్షన్!
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణే (Deepika Padukone) గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఎన్నో కష్టాలను చూసింది. వాటన్నింటిని అధిగమిస్తూ, వచ్చిన ప్రతి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ లో దుసుకెళ్తుంది. ఇటీవల సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పించడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పరోక్షంగా ఈ వివాదంపై స్పందించారు దీపికా. ఇంతకీ ఏమన్నారంటే..?
దీపికా పదుకొనే బాలీవుడ్ ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి మెప్పించిన హీరోయిన్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న AA22xA6 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ కాంబోపై భారీగా పెరిగాయి. అయితే ఇటీవల వరుసగా రెండు భారీ తెలుగు ప్రాజెక్టులు కల్కి 2898 AD సీక్వెల్, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న'స్పిరిట్' మూవీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో పనిచేసే అవకాశం ఉండగా, రెండు సినిమాలు ఒకేసారి వైదొలగడంతో అభిమానుల్లో అనేక ప్రశ్నలు రేకెత్తించింది. ఈ సమయంలో సోషల్ మీడియాలో దీపికా నిర్ణయంపై కొంత నెగటివ్ స్పందన వచ్చింది. వర్కింగ్ అవర్స్, కండీషన్స్ వల్లే ఆమెను తప్పించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీపికా స్వయంగా ఈ విషయం పై స్పందిస్తూ ఓ ఇంటర్వ్యూలో అసలు కారణాలను వెల్లడించారు.
దీపికా ప్రకారం.. సినిమా బడ్జెట్, కలెక్షన్స్, ఇది 100 కోట్ల సినిమానా, 500-600 కోట్ల ప్రాజెక్ట్‌నా అనేది నాకు ముఖ్యమైన అంశం కాదనీ, మరింత స్పష్టంగా చెప్పాలంటే.. పెద్ద సినిమాలు చేయడం కోసం తన ఆరోగ్యాన్ని లేదా వ్యక్తిగత జీవితాన్ని రాజీపడే స్థితిలో తాను లేనని పేర్కొన్నారు. పారితోషికం, డేట్స్ అడ్జస్ట్‌మెంట్, బడ్జెట్ వివాదాలు ఇవేవీ తన వైదొలగడానికి అసలు కారణం కాదని ఆమె స్పష్టం చేశారు.
పెద్ద సినిమాల వర్క్ ఎన్విరాన్‌మెంట్ గురించి మాట్లాడిన దీపికా "చాలామంది ఎక్కువ డబ్బు ఇస్తే చాలు అనుకుంటారు. కానీ, నిజానికి అది సరిపోదు. భారీ ప్రాజెక్ట్ వల్ల శారీరకంగాను, మానసికంగాను ఎంతో ఒత్తిడిని కలిగిస్తాయి. ఆరోగ్యకరమైన పని వాతావరణం లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా కూడా.. మనం మన బెస్ట్ ఇవ్వలేం. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తేనే మనం మంచి అవుట్‌పుట్ ఇవ్వగలం" అని పేర్కొన్నారు.
తన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, వ్యక్తిగత విలువలకు సరిపడే పాత్రలను చేస్తాననీ, పాత్ర ప్రాధాన్యత అత్యంత ముఖ్యమని దీపికా చెప్పారు. ఇలా పరోక్షంగా 'కల్కి 2898 AD', 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చిందనీ అభిమానులు భావిస్తున్నారు. దీపికా తప్పుకున్న తరువాత ఆమె స్థానంలో 'స్పిరిట్' సినిమాలో బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రిను ఫైనల్ చేశారు. కాగా, 'కల్కి 2898 AD' సీక్వెల్‌లో దీపికా స్థానంలో ఎవరిని ఎంపిక చేయనున్నారన్నది ఇంకా ప్రకటించలేదు. ఈ విషయంపై అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపికా వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్-టాలీవుడ్ చర్చనీయంగా మారాయి.


Click it and Unblock the Notifications











