Shah Rukh Khan లేకపోతే నాకు జీవితం లేదు.. పఠాన్ సక్సెస్ మీట్‌లో దీపిక పదుకోన్ కంటతడి

పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న నేపథ్యంలో యష్ రాజ్ ఫిలింస్, చిత్ర యూనిట్ ముంబైలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో షారుక్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహంతోపాటు చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమోషన్ అయిన దీపిక పదుకోన్ మాట్లాడుతూ కంటతడి పెట్టారు. దీపిక పదుకోన్ ఏం మాట్లాడిందంటే..

నెగిటివ్ రోల్స్‌తో మొదలుపెట్టి

నెగిటివ్ రోల్స్‌తో మొదలుపెట్టి


షారుక్ ఖాన్ సినిమా కెరీర్‌లో వివిధ రకరకాల దశలు ఉన్నాయి. తొలుత నెగిటివ్ రోల్స్‌తో కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాల్లో నటించి.. సూపర్ స్టార్ అయ్యారు. మధ్య మధ్యలో యాక్షన్ సీన్లు, యాక్షన్ సినిమాలు చేసి మెప్పించాడు. కరణ్ అర్జున్, రాంజానే, వన్ టూ కా ఫోర్, రాయిస్, దిల్ వాలే లాంటి యాక్షన్, రొమాంటిక్ సినిమాలతో మెప్పించారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి కూడా షారుక్‌ ఇష్టపడేలా చేశాడు.

షారుక్ లేకపోతే.. నేను లేను

షారుక్ లేకపోతే.. నేను లేను


పఠాన్ సినిమా సక్సెస్ సమయంలో నాపై కురుస్తున్న ప్రశంసలు చూస్తే మాకు ఆ గౌరవం లభించడం కరెక్టే అనిపిస్తున్నది. షారుక్ లేకపోతే.. ఈ రోజు నేను ఇక్కడ ఉండేదానిని కాదు. నా తొలి సినిమా ఓం శాంతి ఓం సినిమాలో షారుక్ ఖాన్ అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా షూటింగులో నాకు నమ్మకం కలిగించాడు. నేను హీరోయిన్ మెటీరియల్ అనే విషయంలో నాకు నేను నమ్మకం పొందేలా చేశాడు. ఆ సమయంలోనే నాకు నాపై, నా టాలెంట్‌పై నమ్మకం కలిగింది అని దీపిక పదుకోన్ అన్నారు.

షారుక్ అంకిత భావం

షారుక్ అంకిత భావం


బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ గొప్ప స్టార్. అయినా ఇప్పటికే కొత్తవాడిలో నటన విషయంలో అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. షారుక్ ఖాన్ సరిగా ఫైట్స్ చేయరనే విమర్శిస్తుంటారు. కానీ ఆయనకు డ్యాన్స్ ఎంత ఇష్టమో.. ఫైట్స్ కూడా అంతే ఇష్టం. డ్యాన్సులు చేయడం ఎంత సులభమో.. ఫైట్స్ కూడా అంతే సులభంగా చేస్తుంటారు అని దీపిక పదుకోన్ చెప్పారు.

షారుక్ ఖాన్‌ను చూసి నేర్చుకోవాలి

షారుక్ ఖాన్‌ను చూసి నేర్చుకోవాలి


షూటింగ్ సమయంలో, సెట్స్‌లో షారుక్ సమయస్పూర్తి అద్బుతంగా ఉంటుంది. ఆయన చుట్టు ఉండేవారికి చాలా కంఫర్ట్ ఇస్తారు. ఆయన నుంచి ప్రతీ నటుడు చాలా నేర్చుకోవాల్సి ఉంది. కేవలం రొమాంటిక్ హీరోనే కాదు.. యాక్షన్ హీరోగా తన సత్తా ఏంటో పఠాన్ తోనే కాదు ఎన్నో సినిమాల్లో తన ప్రతిభను చూపించారు అని దీపిక పదుకోన్ అన్నారు.

5 రోజుల్లో 500 కోట్లు

5 రోజుల్లో 500 కోట్లు

రిపబ్లిక్ డే కానుకగా రిలీజైన పఠాన్ చిత్రం కలెక్షన్లు కుంభవృష్టి కురిపిస్తున్నది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిం బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. గత 5 రోజుల్లో ఈ చిత్రం 500 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తూ వసూళ్లు రాబడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X