కంటతడి పెట్టిన దీపిక పదుకోన్.. షూటింగ్‌లో భావోద్వేగానికి గురై..
యాసిడ్ దాడికి గురైన మహిళ జీవిత కథతో తెరకెక్కుతున్న ఛపక్ చిత్రంలో నటించడమే కాకుండా దీపికా పదుకోన్ స్వయంగా నిర్మిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇటీవల మెట్ గాలా, కేన్స్ రెడ్ కార్పెట్‌పై హంగామా చేసిన ఈ అందాల భామ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా మారిపోయారు. లక్ష్మీ అగర్వాల్ అనే బాధితురాలి కథను దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్నారు.
ఛపక్ సినిమా, దీపిక పదుకోన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌లో తొలి రోజున దీపిక భావోద్వేగానికి గురయ్యారట. సినిమాకు సంబంధించిన మొట్టమొదటి సన్నివేశంలో ఆమె ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకొన్నారట. మేఘనా గుల్లార్‌తో తన పాత్ర మాలతి సీన్ గురించి చర్చిస్తూ భావోద్వేగానిక లోనై.. తన కంట్రోల్ చేసుకోలేకపోయారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఛపక్ సినిమా శరవేగంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 19న ముగిసింది. ఆ తర్వాత మాలతి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా విశేష స్పందన వచ్చింది. మాలతి పాత్రలోకి మారిపోయిన తీరును చూసి దీపికను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఛపక్ సినిమాను 2020, జనవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











