నాకు కడుపు వస్తే మీకు నొప్పేంటి? గర్భవతి వార్తలపై భగ్గుమన్న దీపికా పదుకోన్

Recommended Video

Deepika Padukone Slams Pregnancy Rumours || Filmibeat Telugu

సినీతారలను వారి కెరీర్ గురించి కంటే వ్యక్తిగత జీవితాలపైనే అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతుంటాయి. ఎవరైనా డేటింగ్‌లో ఉంటే పెళ్లి ఎప్పుడని, పెళ్లి చేసుకొంటే పిల్లలు ఎప్పుడనే ప్రశ్నలను వారిని వెంటాడుతుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ తార దీపికా పదుకొన్‌కు అదే పరిస్థితి ఎదురవుతున్నది. తాను గర్భవతి అంటూ మీడియాలో హల్‌చల్ చేస్తున్న కథనాలపై దీపికా భగ్గుమన్నారు. బ్రిటన్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్.కో.యూకే అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఎలా ధీటుగా సమాధానం చెప్పారంటే..

గర్బవతిని అనే వార్తలపై దీపికా క్లారిటీ

గర్బవతిని అనే వార్తలపై దీపికా క్లారిటీ

తాను గర్భవతిని వస్తున్న వార్తలపై దీపికా పదుకోన్ వివరణ ఇస్తూ.. పెళ్లి తర్వాత మాతృత్వం అనేది తప్పనిసరి. అది ఎప్పుడు కావాలో, ఆ ప్రక్రియ ఎప్పుడు జరుగాలో అది జరిగిపోతుంది. నా తల్లి దగ్గర నుంచి, నా స్నేహితుల వద్ద నుంచి మాతృత్వం గురించి, అనుభూతి గురించి చాలా తెలుసుకొన్నాను అని అన్నారు.

గర్భం దాల్చడమనేది

గర్భం దాల్చడమనేది

గర్భం దాల్చడం అనేది స్త్రీ జీవితంలో ఓ భాగం. సెలబ్రిటీని అనే ఓకే కారణంతో దానిని హైలెట్ చేస్తూ.. దాని గురించి ఏదేదో రాస్తూ ఇబ్బందిని పెట్టడం సరికాదు. ఇలాంటి ప్రశ్నలు అడగడం ఆగినప్పుడే సమాజంలో, మీడియాలో మార్పు వస్తుందని బలంగా నమ్ముతాను అని దీపిక పదుకోన్ అన్నారు.

ఛపాక్ చిత్ర షూటింగ్‌లో దీపిక బిజీగా

ఛపాక్ చిత్ర షూటింగ్‌లో దీపిక బిజీగా

రణ్‌వీర్ సింగ్‌తో పెళ్లి తర్వాత దీపికా పదుకోన్ ప్రస్తుతం ఢిల్లీలో ఛపాక్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. మాలతి అనే యాసిడ్ బాధితురాలి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. యాసిడ్ ఎటాక్ బాధితురాలిగా, సామాజిక కార్యకర్తగా లక్ష్మీ అగర్వాల్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలోని పాత్రకు సంబంధించిన లుక్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

 నిర్మాతగా మారిన దీపిక పదుకోన్

నిర్మాతగా మారిన దీపిక పదుకోన్

దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఛపాక్ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకురాలు. గతవారమే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమా కోసం దీపికా తొలిసారి నిర్మాతగా మారింది. విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 2020 జనవరి 10న రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X