తెలుగు హీరోలపై దీపికా పదుకొన్ కామెంట్.. ఆ హీరో పర్సనాలిటీ ఇష్టం అంటూ.. మరో హీరోపై కూడా
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటేనే బాలీవుడ్ సెలబ్రిటీలు కాస్త చిన్న చూపు చూసేవారు. తెలుగు లో నటించడానికి కూడా కొంతమంది పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. మొదట్లో తెలుగులో సినిమాలు చేసిన కొంతమంది హీరోయిన్స్ అయితే ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చినా కూడా నటించడానికి ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగులో ఒక్క అవకాశం వచ్చిన చాలు అని ఎదురు చూసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
ముఖ్యంగా స్టార్ హీరోల పై బాలీవుడ్ ముద్దుగుమ్మలు చాలా పాజిటివ్ గా స్పందించడం విశేషం. రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొన్ కూడా టాలీవుడ్ స్టార్ హీరోల పై మొదటిసారి విభిన్నమైన తరహాలో స్పందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు అలాంటి ఆలోచన
టాలీవుడ్ అగ్రహీరోలు ఇటీవల కాలంలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే రెబల్ స్టార్ ప్రభాస్ తో మొదలైన ఈ పాన్ ఇండియా మార్కెట్ మిగతా హీరోలకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక్కసారి అటు వైపు వెళితే మళ్లీ వెనక్కి తిరిగి చూసుకో వద్దు అలాగా పవర్ఫుల్ సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇక వారి బిజినెస్ మార్కెట్ లెవెల్లో చూస్తున్నాం బాలీవుడ్లో చాలామంది ఫిదా అయిపోతున్నారు.

తెలుగులో అవకాశాల కోసం..
బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకోవడంతో బాలీవుడ్ ముద్దుగుమ్మలు మన హీరోలతో కూడా సినిమాలు చేయాలని వారి ఆలోచనలు మార్చుకుంటున్నారు. అలియా భట్ అయితే ఏకంగా రాజమౌళి దగ్గరికి వచ్చి మరి తెలుగు సినిమాలు చేయడానికి తాను సిద్ధమే అని చెప్పి RRR సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

దీపికా పదుకొన్ కూడా
ఇక దీపికా పదుకొన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ లలో ఒకరు అయినప్పటికీ తెలుగు హీరోలతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పేసింది. ఇప్పటికే ఆమె ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ K చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా విదేశీ భాషల్లో కూడా విడుదల అవుతోంది. కాబట్టి పాన్ వరల్డ్ సినిమా అని కూడా చెప్పవచ్చు.

సిస్టర్ బాయ్ ఫ్రెండ్ తో..
ఇక రీసెంట్ గా ఇచ్చిజ ఇంటర్వ్యూలో దీపికా తన తాజా చిత్రం గెహ్రియాన్ సినిమా గురించి అనేక విశేషాలను తెలియజేసింది. ఆ సినిమాలో దీపికా తన సిస్టర్ బాయ్ ఫ్రెండ్ తో అక్రమ సంబంధం కలిగి ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుంది. నేడు అమెజాన్ ప్రైమ్ లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక సినిమాలో దీపికా నెవ్వర్ బిఫోర్ అనేలా రొమాన్స్ సీన్స్ తో షాక్ ఇచ్చింది.
ఎన్టీఆర్ పర్సనాలిటీ ఇష్టం అంటూ..
జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ తనకు చాలా ఇష్టమని అతని పర్సనాలిటీ కూడా చాలా నచ్చుతుందని దీపికా వివరణ ఇచ్చింది. ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా అతనితో నటించేందుకు సిద్ధమే అంటూ అల్లు అర్జున్ కూడా ఒక విధంగా చాలా లైకింగ్ అని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలపైనే తన ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు తెలిపిన దీపికా మిగతా హీరోలపై పెద్దగా కామెంట్ చేయలేదు.

అల్లు అర్జున్ తో వర్క్ చేయాలని..
ఇక కొంతమంది టాలీవుడ్ హీరోస్ తో తనకు నటించాలని కోరికగా ఉందని అంటూ ఇక అల్లు అర్జున్ స్టైలిష్ స్మార్ట్ అంటూ అతనితో కూడా వర్క్ చేసేందుకు ఎక్కువహా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా మార్చి 25న హిందీలో కూడా భారీగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











