దీపికా పదుకొన్ పెళ్లి.. రణ్‌వీర్‌కు ముందు ఏడుగురితో డేటింగ్.. వారెవరో తెలుసా?

బాలీవుడ్‌ అంతా పెళ్లి సందడిగా మారింది. అందాల తారలు దీపికా పదుకొన్, ప్రియాంక చొప్రా మిస్ ట్యాగ్ నుంచి మిసెస్‌కు మారబోతున్నారు. ఈ ఇద్దరు తారలు తమను ప్రేమించిన.. తమకు నచ్చిన వారిని పెళ్లాడబోతున్నారు. దీపిక, రణ్‌వీర్ సింగ్ పెళ్లి వార్త మీడియాలో ప్రముఖంగా మారింది. రణ్‌వీర్ సింగ్‌తో అఫైర్‌కు ముందు దీపిక పదుకోన్ పలువురితో డేటింగ్ చేసింది.. చివరిగా రణ్‌వీర్‌తో పీకల్లోతు ప్రేమ పెళ్లి వరకు తెచ్చింది.. ఇంతకీ దీపిక జీవితంలోకి తొంగిచూసిన వారెవరంటే..

నిహార్ పాండ్యాతో డేటింగ్

నిహార్ పాండ్యాతో డేటింగ్

సినీ రంగంలోకి ప్రవేశించే సమయంలో యాక్టింగ్ స్కూల్‌లో మొదటిసారి నిహార్ పాండ్యాతో డేటింగ్ చేసింది. ఫోకస్ అంతా కెరీర్‌పై ఉండటంతో వీరిద్దరి మధ్య అంతగా రొమాన్స్‌కు చోటు దక్కలేదు. దీపికాకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా రావడంతో వారి మధ్య అఫైర్ సామరస్యంగానే తెగిపోయింది.

ఉపేన్ పటేల్‌తో అఫైర్

ఉపేన్ పటేల్‌తో అఫైర్

బాలీవుడ్‌లో స్టార్ ఎదుగుతున్న క్రమంలో నటుడు ఉపేన్ పటేల్‌తో దీపికా పదుకోన్ డేటింగ్ చేసింది. ఓ ఫోటోషూట్ సమయంలో వారిద్దరూ ఒక్కటయ్యారని చెప్పుకొంటారు. కానీ ఇతడితో కూడా పెద్దగా అఫైర్‌ను కొనసాగించలేదు. వారిద్దరూ కలిసి ట్రావెల్ చేసింది చాలా తక్కువ సమయమే.

ఎంఎస్ ధోనితో లవ్

ఎంఎస్ ధోనితో లవ్

ఇండియన్ కెప్టెన్‌గా జోరు కొనసాగిస్తున్న సమయంలో ఎంఎస్ ధోని, దీపికా పదుకోన్ పదుకోన్ మధ్య అఫైర్ నడిచింది. ఓం శాంతి ఓం తర్వాత దీపికాను పరిచయం చేయమని షారుక్‌ను అడుగడం, ఆ తర్వాత వారిని బాద్షా పరిచయం చేయడంతో వారి మధ్య బంధం బలపడింది. ధోని ఆడే పలు మ్యాచులకు దీపికా హాజరయ్యారు కూడా. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే ధోని, దీపికా మధ్య అఫైర్ బ్రేకప్ అయింది.

యువరాజ్ సింగ్‌తో ప్రేమాయణం

యువరాజ్ సింగ్‌తో ప్రేమాయణం

ఎంఎస్ ధోని తర్వాత క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రేమాయణం నడిపింది. దీపికాపై మనసు పారేసుకొన్నది ముందు యువరాజే అని చెబుతారు. తన సొంత ఇంటిలో యువరాజ్ బర్త్ డే దీపిక చేయడం మీడియాలో రచ్చ రచ్చ అయింది. అదే విధంగా దీపిక బర్త్ డేను కూడా యువరాజ్ గ్రాండ్‌గా చేశాడు. కానీ వీరి ప్రేమలో యువరాజ్ తల్లి విలన్‌గా మారడంతో పెళ్లి వరకు చేరలేకపోయింది.

రణ్‌బీర్, దీపిక ప్రేమాయణం

రణ్‌బీర్, దీపిక ప్రేమాయణం

రణ్‌బీర్, దీపికా పదుకోన్ ప్రేమ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. యే జవానీ హై దీవాని షూటింగ్‌లో హీరో రణ్‌బీర్ కపూర్; దీపికాల మధ్య ప్రేమ చిగురించింది. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే దీపికతో అఫైర్ ఉండగానే మరో హీరోయిన్‌తో కలిసి రణ్‌బీర్ పట్టుబడటం బ్రేకప్ జరిగింది.

సిద్ధార్థ మాల్యాతో జోడి కట్టి

సిద్ధార్థ మాల్యాతో జోడి కట్టి

రణ్‌బీర్ కపూర్‌తో అఫైర్ తర్వాత విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యాతో డేటింగ్ చేసింది. వారిద్దరు కలిసి పార్టీలు చేసుకోవడం, పలు ఈవెంట్లకు వెళ్లడం, ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరుకావడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఓ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన సందర్భంలో దీపికను బహిరంగంగా ముద్దుకోవడం సంచలనంగా మారింది.

కశ్మీర్ హీరోతో డేటింగ్

కశ్మీర్ హీరోతో డేటింగ్

ఇక రణ్‌వీర్‌ సింగ్‌తో ప్రేమలో పడటానికి ముందు మోడల్, యాక్టర్ ముజామిల్ ఇబ్రహీంతో డేటింగ్ చేసింది. కాశ్మీర్‌కు చెందిన ఈ హీరో 2007లో ధోఖా అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. యే జవానీ హై దివానీ సినిమాలో నటించాల్సింది. కానీ వ్యక్తిగత విభేదాల కారణంగా ఆ సినిమాను రిజెక్ట్ చేశాడనేది బాలీవుడ్ పత్రికల కథనం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X