యాసిడ్ దాడి బాధితురాలిగా హీరోయిన్ దీపిక పదుకోన్!

Recommended Video

Deepika Padukone To Venture Into Film Production With Meghna Gulzar’s Next ?

'పద్మావత్' తర్వాత బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ నెక్ట్స్ మూవీ ఎట్టకేలకు ఖరారైంది. గత చిత్రంలో రాణి పద్మిని పాత్రలో నటించిన ఈ బెంగుళూరు పాప తర్వాతి సినిమాలో యాసిడ్ ఎటాక్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ పాత్రలో కనిపించబోతున్నారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని స్వయంగా దీపిక నిర్మించబోతుండటం మరో విశేషం.

లక్ష్మి అగర్వాల్ 15 ఏళ్ల వయసులోనే యాసిడ్ దాడికి గురయ్యారు. యాసిడ్ ఎఫెక్ట్ వల్ల వికృతంగా మారిన ఆమె ముఖానికి పలు సర్జరీలు జరిగాయి. కొన్నేల్లుగా లక్ష్మి అగర్వాల్ యాసిడ్ దాడులు ఆపాలంటూ కాంపెయిన్స్ నిర్వహించడంతో పాటు యాసిడ్ దాడికి గురైన వారికి సహయం చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె 2014లో మెచెల్లీ ఒబామా చేతుల మీదుగా యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు సైతం అందుకున్నారు.

తన తర్వాతి సినిమా గురించి దీపిక

తన తర్వాతి సినిమా గురించి దీపిక

తన తర్వాత గురించి దీపిక పదుకోన్ ముంబైలో మీడియాలో మాట్లాడుతూ... ‘‘నేను లక్ష్మి అగర్వాల్ కథ విన్న వెంటనే భావోద్వేగానికి గురయ్యాను. ఇలాంటి ధైర్యవంతురాలైన మహిళ పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆమె కథ అందరికీ తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాలనుకుంటున్నాను' అని తెలిపారు.

‘రాజి’ మూవీ దర్శకురాలు మేఘన

‘రాజి’ మూవీ దర్శకురాలు మేఘన

మేఘనా గుల్జార్ ఇంతకు ముందు అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రాజి' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. లక్ష్మి అగర్వాల్ కథను సినిమా తీయడం ద్వారా మన దేశంలో జరుగుతున్న యాసిడ్ దాడుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించినట్లు ఉంటుందని, అందుకే ఈ కథను ఎంచుకున్నట్లు మేఘన తెలిపారు.

ఈ పాత్రకు దీపిక పర్ఫెక్ట్

ఈ పాత్రకు దీపిక పర్ఫెక్ట్

ఈ సినిమాకు దీపిక అయితేను పూర్తి న్యాయం చేయగలదని నా నమ్మకం. కథ చెప్పిన వెంటనే ఆమె కన్విన్విన్స్ అయ్యారు. దీపిక ఫిజిక్ కూడా లక్ష్మి అగర్వాల్ పాత్రకు మ్యాచ్ అయ్యాలా ఉంటుంది. నేను కథ చెప్పిన వెంటనే ఆమె సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పడంతో నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది అని మేఘన గుల్జార్ తెలిపారు.

 పెళ్లి తర్వాతేనా?

పెళ్లి తర్వాతేనా?

కాగా... దీపిక పదుకోన్ తన ప్రియుడు రణవీర్ సింగ్‌ను నవంబర్లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి డేట్ ఎప్పుడనే విషయం ఇంకా బయటకు రాలేదు. వీరి వివాహం తర్వాత దీపిక పదుకోన్ నెక్ట్స్ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X