ఆయనతో ఆ బాధ పడలేకపోతున్నా.. రణ్‌వీర్ సింగ్‌పై దీపికా ఫిర్యాదు

బాలీవుడ్‌లో సెలబ్రిటీ దంపతులు దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ క్వారంటైన్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారనే విషయం వారు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న ఫోటోలు, అప్‌డేట్లతో స్పష్టమవుతున్నది. దీపికా, రణ్‌వీర్ మధ్య చిలిపి చేష్టలు, గిల్లి కజ్జాలు లాంటి వాళ్ల కెమిస్ట్రీకి అద్దం పడుతున్నాయి. తాజాగా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన దీపిక ఇన్స్‌టాగ్రామ్‌లో నెటిజన్లతో Ask Me అంటూ ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ సందర్బంగా వేసిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన భర్త రణ్‌వీర్ గురించి కొన్ని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులు ఏమిటంటే..

20 గంటలు నిద్రలోనే మునిగి

20 గంటలు నిద్రలోనే మునిగి

లాక్‌డౌన్‌ కారణంగా రణ్‌వీర్‌తో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించింది. ఇలాంటి సమయంలో ప్రపంచంలో చాలా ఈజీగా ఎవరితోనైనా గడపవచ్చంటే అది రణ్‌వీర్ సింగ్‌తోనేనని గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే 24 గంటల్లో దాదాపు 20 గంటలు నిద్రలోనే ఉంటాడు. మిగితా నాలుగ గంటల్లో తినడం, సినిమాలు చూడటం, వర్కవుట్లు చేయడం జరుగుతున్నది అని దీపికా పదుకోన్ చెప్పారు.

 హాయిగా నిద్రపోతూ.. తింటూ

హాయిగా నిద్రపోతూ.. తింటూ

ఇక లాక్‌డౌన్‌ను రణ్‌వీర్ ఎంజాయ్ చేసినంతగా మరొకరు ఎంజాయ్ చేయరేమో. ఎలాంటి బాదరాబందీ లేదు. ఎలాంటి ఆలోచనలు లేవు. హాయిగా నిద్రపోతూ, సినిమాలు చూస్తూ చాలా హాయిగా లైఫ్‌ను లాగించేస్తున్నాడు. బయట ఏం జరుగుతున్నదనే విషయంపై బెంగ కనీసం కూడా కనిపించడం లేదు అని దీపికా పదుకోన్ వెల్లడించారు.

35 వేలసార్లు అలా...

35 వేలసార్లు అలా...

ఇక ఇన్స్‌టాగ్రామ్‌లో ముఖాముఖితో రణ్‌వీర్ సింగ్‌కు నీవేమైనా చెప్పదలుచుకొంటావా అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు దీపిక సమాధానం చెబుతూ.. ఇప్పటి వరకు రణ్‌వీర్ 35 వేల సార్లు అలారంను ఆపేసి పడుకొని ఉంటారేమో. డైనింగ్ టేబుల్ మీద బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉందని ఎన్నిసార్లు అరిచినా అలారం ఆపేసి నిద్రలోనే మునిగిపోతారు. ఇది నాకు చాలా కష్టంగా ఉంది అంటూ దీపిక పదుకోన్ తెలిపారు.

 సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అంటే

సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అంటే

మీకు కాఫీ లేదా టీ లో ఏది ఇష్టమని నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. నాకు సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీతోపాటు మంచి టీ ఇష్టం దీపికా పదుకోన్ చెప్పారు. నాకు ఎక్కువగా దక్షిణాది వంటలు, తిను బండారాలు ఇష్టం. రణ్‌వీర్ కూడా అలాంటి వాటిని ఇష్టం తింటారని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ముగిస్తే ఓసారి బెంగళూరుకు వెళ్లి నా తల్లిదండ్రులను కలువాలని ఉంది అని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు.

 83 చిత్రంలో రణ్‌వీర్‌తో కలిసి

83 చిత్రంలో రణ్‌వీర్‌తో కలిసి

దీపికా పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా అంటే లాక్‌డౌన్ సమయంలో చపాక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చారు. కపిల్ దేవ్ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు, 83 ప్రపంచ కప్ గెలిచిన సందర్భం నేపథ్యంగా తెరకెక్కిన 83 చిత్రంలో రణ్‌వీర్, దీపిక పదుకోన్ కలిసి నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X