ప్రభాస్ సినిమా కోసం దీపికా రెమ్యునరేషన్ ఎంత.. అడిగినంత ఇచ్చేశారా?

రెమ్యునరేషన్స్ అనేవి ఈ రోజుల్లో చాలా తొందరగా పెరిగిపోతున్నాయి. ఒక సినిమా హిట్టవ్వగానే నెక్స్ట్ సినిమాకు ఊహించని విధంగా ఫీజులు పెంచేస్తున్నారు అగ్ర తారలు. ఓవర్ నైట్ లోనే లెక్కలు మారిపోతుండడంతో చిన్న నిర్మాతలు కాస్త బయపడిపోతున్నారు. ఇక ప్రస్తుతం అందరి దృష్టి దీపికా పదుకొనె రెమ్యునరేషన్ పైనే ఉంది. ఎందుకంటే ఆమె ప్రభాస్ 21వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంతకు ఒప్పుకుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఆ హీరోయిన్ ని కాదని..

ఆ హీరోయిన్ ని కాదని..

గత నెల రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రూమర్ బాగా వైరల్ అయ్యింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న పాన్ ఇండియన్ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. మొన్నటి వరకు దర్శకుడు దీపికాను కాదని కీయరా అద్వానీతో కూడా చర్చలు జరిపినట్లు టాక్ వచ్చింది. ఇక నేటితో ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది వైజయంతి మూవీస్.

రెమ్యునరేషన కూడా భారీగానే

రెమ్యునరేషన కూడా భారీగానే

సాధారణంగా వైజయంతి మూవీస్ అనగానే బిగ్ బడ్జెట్ సినిమాలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అగ్ర తారలను సెలెక్ట్ చేసుకొని వారి మార్కెట్ కి తగ్గట్టుగా రెమ్యునరేషన్స్ కూడా ఇస్తుంటారు. ఇక శక్తి సినిమాతో కాస్త దెబ్బతిన్న తరువాత గ్యాప్ తీసుకొని మళ్ళీ మహానటితో రికవర్ అయ్యారు. ఇక ఇప్పుడు ప్రభాస్ 21ని నేషనల్ వైడ్ గా రూపొందిస్తుండడంతో రెమ్యునరేషన కూడా భారీగానే ఉండి ఉంటాయని టాక్ వస్తోంది.

దీపికా రెమ్యునరేషన్ ఎంత..

దీపికా రెమ్యునరేషన్ ఎంత..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పదుకొనె రెమ్యునరేషన్ ప్రస్తుతం 15 నుంచి 20కోట్లకు మధ్యన ఉంటుందాని బాలీవుడ్ మీడియాలో ఒక టాక్ నడుస్తోంది. ఇక కొన్నిసార్లు సినిమా మార్కెట్ ని బట్టి పేమెంట్స్ పెంచే ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రభాస్ 21వ సినిమా పాన్ ఇండియాగా అన్ని భాషల్లో రూపొందుతోంది కాబట్టి తప్పకుండా ఆమె రేంజ్ కి తగ్గట్లే ఇచ్చి ఉంటారని తెలుస్తోంది.

Recommended Video

Actor Naresh Starts Dubbing For Jathi Ratnalu movie
మొత్తానికైతే ఒప్పించారు..

మొత్తానికైతే ఒప్పించారు..

మొదట ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపినప్పటికి రెమ్యునరేషన్ విషయంలో దీపికా కాస్త సందేహీంచింది అనే టాక్ వచ్చింది. అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఇక ఆమెతో డీలింగ్ ఎలా సెట్ చెసుకున్నారో తెలియదు గాని మొత్తానికి ఒప్పించారు. ఇక సినిమా కోసం నిర్మాత అశ్విని దత్ ఏ స్థాయిలో ఖర్చు చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X