Deepika Padukone:ఈరోజు నేను ఉండేదాన్ని కాదు.. తన మానసిక పరిస్థితి గురించి దీపికా పదుకొణె షాకింగ్ గా..

ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందింది దీపికా పదుకొణె. అలాగే బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో టాప్ లిస్టులో ఉంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా విభిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా పెళ్లి తర్వాత కూడా స్పీడ్ పెంచింది అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు పలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిపాలవడం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచ మానసిక ఆర్యోగ్య దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా పదుకొణె షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

 స్టార్ హీరోయిన్ల జాబితాలో..

స్టార్ హీరోయిన్ల జాబితాలో..


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో ఉన్నవారిలో దీపికా పదుకొణె ఒకరు. ప్రస్తుతం ఆమె హిందీలో అధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అంతేకాకుండా పెళ్లయిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

డిఫరెంట్ ప్రాజెక్టులు..

డిఫరెంట్ ప్రాజెక్టులు..

ప్రస్తుతం దీపికా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో 'పఠాన్' సినిమా చేస్తోంది. అలాగే హృతిక్ రోషన్‌ 'ఫైటర్'లో కూడా హీరోయిన్ గా నటించనుంది. అలాగే మరికొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఒక లేడీ ఒరియంటెడ్ ప్రాజెక్టులో కూడా నటించనున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రాజెక్ట్ కె మూవీలో దీపికా నటించనున్న విషయం తెలిసిందే.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..


ఇదిలా ఉంటే అక్టోబర్ 10న అంటే ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీపికా పదుకొణె తమిళనాడులోని ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో భాగంగా ఓ ప్రముఖ ఆంగ్ర ప్రత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన దీపికా పదుకొణె మానసిక ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తను జీవితంలో ఎదుర్కొన్న మానసిక అనారోగ్యం గురించి వెల్లడించి ఆశ్చర్యపరిచింది దీపికా పదుకొణె.

నా మానసిక పరిస్థితి బాగోలేదని..

నా మానసిక పరిస్థితి బాగోలేదని..


''మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు సంరక్షకులు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకు నా విషయాన్నే తీసుకోండి. నా మానసిక పరిస్థితి బాగోలేదని మా అమ్మ గుర్తించకపోతే నేను ఏమై పోయేదాన్నో. ఆమె గుర్తించడం వల్లే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాను. క్రమం తప్పకుండా వాళ్ల సలహాలు పాటించి చికిత్స తీసుకున్నాను. నేను బెంగళూర్ లో ఉంటున్నప్పుడు నా తల్లిదండ్రులు వచ్చినప్పుడల్లా నా మానసిక స్థితి బాగానే ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసేదాన్ని.

ఆమెకు మొత్తం వివరించి చెప్పాను...

ఆమెకు మొత్తం వివరించి చెప్పాను...

కానీ, ఒక రోజు మా అమ్మ ఆ విషయాన్ని గ్రహించి.. నన్ను నిలదీసి అడిగింది. నీకు ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. ఏమైంది. ఎందుకిలా ఉంటున్నావ్ అని అడిగింది. అప్పుడు నా పరిస్థితి మొత్తం ఆమెకు వివరించి చెప్పాను. నాకు ఆ సమయంలో మా అమ్మను ఆ దేవుడే పంపించాడనిపించింది'' అని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది దీపికా పదుకొణె.

2015లో తొలిసారిగా..

2015లో తొలిసారిగా..

కాగా 2015లో తొలిసారిగా తన మానసిక ఇబ్బంది గురించి బయటకు చెప్పింది దీపికా పదుకొణె. అప్పుడు ఈ విషయం విని ఆమె ఫ్యాన్స్ తోపాటు సినీ లోకం షాక్ కు గురైంది. ఇక ఇప్పుడు లివ్ లవ్ లాఫ్ కమ్యూనిటీతో కలిసి మానసిక అనారోగ్యంతో పోరాడుతున్న వారికి సహాయం చేస్తోంది బ్యూటీఫుల్ హీరోయిన్ దీపికా పదుకొణె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X