For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Deepika Padukone.. స్టార్‌ హీరోను తలదన్నేలా కఠోరంగా.. అలాంటి సీన్ల కోసం వీర లెవెల్లో!

  |

  బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకోన్ తన కెరీర్ గ్రాఫ్‌ పరుగులు పెడుతున్నారు. హిందీ, తెలుగు సినిమాలే కాకుండా తమిళ భాషల్లో కూడా నటించేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు. లాక్‌డౌన్ తర్వాత వరుసగా సినిమాలను అంగీకరిస్తూ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. తన ఆరోగ్యం, అందం గురించిన సీక్రెట్స్‌ను వెల్లడించారు. దీపిక పదుకోన్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

  దీపిక టాలీవుడ్ ఎంట్రీ

  దీపిక టాలీవుడ్ ఎంట్రీ

  దీపిక పదుకోన్ లాక్‌డౌన్ కాలంలో పలు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు స్పష్టమైంది. అందులో ఒకటి ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం. ప్రభాస్ సరసన ప్యాన్ వరల్డ్ మూవీలో నటించడమే కాకుండా తొలిసారి తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

  మరోసారి రజనీకాంత్‌తో

  మరోసారి రజనీకాంత్‌తో

  ఇక తమిళంలో కూడా రజనీకాంత్‌తో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారనే వార్త కోలీవుడ్‌లో వైరల్‌గా మారింది. అయితే ఈ సినిమా గురించి అధికారికంగా ఎక్కడా, ఎవరూ కూడా ధృవీకరించలేదు. గతంలో దీపిక, రజనీకాంత్ కాంబినేషన్‌లో కొచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో మళ్లీ రజనీతో కాంబినేషన్ రావడానికి చాలా సమయం పట్టింది.

  షారుక్‌తో పఠాన్ చిత్రంలో

  షారుక్‌తో పఠాన్ చిత్రంలో

  ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో పఠాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగులో బిజీగా మారారు. అయితే దీపిక పదుకోన్ ముందెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో యాక్షన్ సీన్లలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా దీపిక పదుకోన్ మాట్లాడుతూ... నా కెరీర్‌లో ఈ స్థాయిలో యాక్షన్ సీన్లలో నటించడం ఇదే మొదటిసారి అని అన్నారు.

  కోవిడ్ తర్వాత ఆరోగ్య సమస్యలు

  కోవిడ్ తర్వాత ఆరోగ్య సమస్యలు


  అయితే కోవిడ్ బారిన పడిన తర్వాత చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వాటిని అధిగమించి మళ్లీ మామూలు స్థాయికి ఫిట్‌నెస్ పెంచుకొన్నాను. పలు కోవిడ్ కారణంగా సినిమా షెడ్యూల్స్ అన్నీ గజిబిజి అయ్యాయి. వివిధ సినిమాల డేట్స్‌ను బ్యాలెన్స్ చేయడం కొంత ఇబ్బందిగా మారింది. వాటిని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. పలు రకాల షూటింగ్స్ కారణంగా పఠాన్ కోసం యాక్షన్ సీన్లలో నటించడానికి ట్రైనింగ్ అవసరం అయింది. డేట్స్ అడ్జస్ట్ చేసుకొంటూ ఆ ట్రైనింగ్‌ను కొనసాగించాను అని చెప్పారు.

  పఠాన్ యాక్షన్ సీన్ల కోసం

  పఠాన్ యాక్షన్ సీన్ల కోసం

  పఠాన్ సినిమా కోసం యాక్షన్ సీన్లు చేయడానికి చాలా కఠిన పరిశ్రమ అవసరమైంది. యోగా, ఫైట్స్ సీన్ల కోసం శారీరకంగా ట్రైనింగ్ అవసరమైంది. వారంలో ఆరు రోజుల పాట ప్రతీ రోజు గంటన్నర ఆ ప్రాక్టీస్ కోసం కేటాయించాను. ఈ కాలంలో స్ట్రిక్టుగా డైట్ మెయింటెన్ చేశాను. యాక్షన్ సీన్ల కోసం ఫిట్ కనిపించడం ఒక ఎత్తయితే.. ముఖంలో అందం తరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది అని దీపిక పదుకోన్ చెప్పారు.

  Prabhas 21 : Nag Ashwin Repeats Mahanati Crew | Deepika Padukone | Prabhas
  దీపిక పదుకోన్ కెరీర్ ఇలా..

  దీపిక పదుకోన్ కెరీర్ ఇలా..


  దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే... ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ఇంటెర్న్ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్నారు. అలాగా మహాభారత్ చిత్రంలో, కపిల్ దేవ్ బయోపిక్ 83, ఫైటర్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే షకున్ బాత్రా రూపొందించే చిత్రంలో నటించడానికి అంగీకరించారు.

  English summary
  Bollywood actress Deepika Padukone reveals secret of Beauty and Fitness. After tested Covid 19 positive, She did lot of yoga, Workouts. Deepika prepared for Pathan movie actions scenes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X