Deepika Padukone అలాంటి డ్రస్‌లో అందాల జిగేల్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపిక పదుకోన్ పెళ్లి తర్వాత కూడా తన జోష్‌ను ఏ మాత్రం తగ్గించలేదనే విషయం స్పష్టమైంది. స్టార్ హీరోయిన్‌గా నటిస్తూనే నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. అంతేకాకుండా మరోసారి దక్షిణాది సినీ పరిశ్రమలోకి ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలోకి దీపిక పదుకోన్ అడుగుపెట్టనున్నది. అయితే పెళ్లి తర్వాత కూడా తన అందచందాలు తగ్గలేదనే విషయం తాజా ఫోటోషూట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీపిక పదుకోన్ గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

తెలుగు సినిమా పరిశ్రమలో
దీపిక పదుకోన్ తొలిసారి తెలుగు సినిమాతో భాగమయ్యారు. అయితే ఆ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటిస్తుండటంతో మరింత విశేషంగా మారింది. ఈ సినిమాను ప్రస్తుతం ప్రాజెక్ట్ Kగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ప్రభాస్‌తో టెన్షన్‌లో ఉన్నా..
అయితే ప్రభాస్‌తొ కలిసి నటించడంపై దీపిక పదుకోన్ మీడియాతో మాట్లాడుతూ టెన్షన్ పడిపోయారు. నేను ఇంత వరకు ప్రభాస్‌తో కలిసి నటించలేదు. అందుకు చాలా నెర్వస్‌గా ఉన్నాను. ఈ సినిమా కంప్లీట్‌గా ఢిఫరెంట్ వాతావరణంలో జరుగనున్నది. చాలా వీఎఫ్ఎక్స్ అవసరం ఉంది. ఈ కొత్తరకం, విభిన్నమైన ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉంది అంటూ దీపక పదుకోన్ చెప్పారు.

ప్రాజెక్ట్ Kలో అమితాబ్, ప్రభాస్‌తో
అయితే సెకండ్ లాక్‌డౌన్ కారణంగా ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ ఆగిపోయింది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అంతలోనే రెండో లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌ను కొద్ది రోజులు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లో ప్రాజెక్ట్ K చిత్ర షూటింగులో పాల్గొనేందుకు దీపిక పదుకోన్ వస్తున్నట్టు ఆమె టీమ్ సభ్యులు వెల్లడించారు.

నటిగా, నిర్మాతగా దీపిక పదుకోన్
అంతేకాకుండా, దీపిక పదుకోన్ మరోసారి హాలీవుడ్ సినిమాలో భాగం కానున్నారు. KA అనే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా నటిగా కూడా కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. అంతేకాకుండా కపిల్ దేవ్ బయోపిక్‌గా రూపొందుతున్న 83 అనే చిత్రంలో కూడా భర్త రణ్‌వీర్ కపూర్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు కూడా ఆమె నిర్మాతగా దీపిక పదుకోన్ వ్యవహరించడం విశేషంగా చెప్పుకోవచ్చు.

దీపిక లేటేస్ట్ ఫోటోలు వైరల్
ఇలా నిర్మాతగా, నటిగా విభిన్నమైన చిత్రాలతో భాగమైన దీపిక పదుకోన్ తాజా ఫోటోషూట్ వైరల్ అయింది. బ్లాక్ డ్రస్సులో ఆమె మరింత అందంగా కనిపించింది. హోయలు ఒలికిస్తూ కెమెరాకు ఫోజిచ్చిన దీపిక ఫోటోలు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాయి. దాంతో దీపిక అందాలపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Recommended Video

దీపిక పదుకోన్ సినీ కెరీర్ ఇలా
దీపిక పదుకోన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన కపిల్ దేవ్ బయోపిక్ 83 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో నటించడం ద్వారా దీపిక పదుకొన్ తెలుగులో అడుగుపెట్టనున్నారు. అలాగే శకున్ బాత్రా చిత్రంలో, షారుక్ ఖాన్‌తో పఠాన్, రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. STXfilms, Temple Hill Productions బ్యానర్‌తో కలిసి ఓ హాలీవుడ్ చిత్రంలో నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











