Deepika Padukone: వింత డ్రెస్‌తో అందాల ఆరబోత.. మొన్న రొమాన్స్ ఇప్పుడు ఘోరంగా!

సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని రేంజ్‌కు ఎదిగిపోయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. స్టార్‌డమ్‌ను కూడా అందుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తోంది. ఇక, కొన్నేళ్ల క్రితమే స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడిన దీపికా పదుకొనే.. వివాహం తర్వాత కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అంతేకాదు, సోషల్ మీడియాలోకి సైతం ఎంట్రీ ఇచ్చి రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే దీపికా తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి!

అలా మొదలైన కెరీర్.. స్టార్ స్టేటస్‌

అలా మొదలైన కెరీర్.. స్టార్ స్టేటస్‌

తండ్రి ప్రకాశ్ పదుకొనేలా బాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలనుకుని.. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది దీపిక పదుకొనే. ఈ క్రమంలోనే 'ఐశ్వర్య' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత షారూఖ్ 'ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది.

డేటింగ్ రూమర్స్... యమ పాపులర్

డేటింగ్ రూమర్స్... యమ పాపులర్

యాక్టింగ్ పరంగా మెప్పించి కెరీర్ ఆరంభంలోనే దీపిక పదుకొనే మంచి గుర్తింపును దక్కించుకుంది. అదే సమయంలో లవ్ ట్రాకుల కారణంగా దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోయింది. అప్పట్లో క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌తోనూ ప్రేమాయణం సాగించింది. వీళ్లిద్దరి తర్వాత విజయ్ మాల్యా కుమారుడితోనూ డేటింగ్ చేసింది. దీంతో యమ పాపులర్ అయిపోయింది.

ఆ హీరోతో డేటింగ్.. మరొకరితో పెళ్లి

ఆ హీరోతో డేటింగ్.. మరొకరితో పెళ్లి

సినిమాల పరంగా మెప్పించినా దీపికా పదుకొనే వ్యవహార శైలిపై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఆమె వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. సరిగ్గా ఆ సమయంలోనే రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్ చేసింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పి రణ్‌వీర్ సింగ్‌ ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడినే వివాహమాడింది.

వివాహం తర్వాత వరుస మూవీలు

వివాహం తర్వాత వరుస మూవీలు

వివాహం తర్వాత మరింత స్పీడు పెంచిన దీపిక పదుకొనే.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ మూవీ '83'లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించింది. షారూఖ్ ఖాన్‌తో 'పఠాన్' అనే సినిమా చేస్తుంది. దీనితో పాటు హృతిక్ రోషన్‌తో 'ఫైటర్' అనే మూవీలోనూ చేస్తోంది. అలాగే, ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్ K'లోనూ నటిస్తోందీ బ్యూటీ.

 ఆ సినిమా ట్రైలర్‌లో రొమాన్స్‌తో

ఆ సినిమా ట్రైలర్‌లో రొమాన్స్‌తో

దీపికా పదుకొనే ఇటీవలే 'గెహ్రాయియాన్' అనే సినిమాలో నటించింది. షకున్ బాత్రా తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్‌లో నేరుగా విడుదల కాబోతుంది. ఇక, దీనికి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదల కాగా.. అందులో దీపికా చేసిన రొమాన్స్ హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, శృంగారం వంటి వాటితో పాటు గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. దీంతో ఈ భామ వార్తల్లో నిలుస్తోంది.

సోషల్ మీడియాలో మాత్రం రచ్చ

సోషల్ మీడియాలో మాత్రం రచ్చ

ఆరంభంలోనే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉన్న దీపికా పదుకొనే.. కొన్నేళ్ల పాటు అన్ని ఖాతాలనూ క్లోజ్ చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మధ్యనే మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా పోస్టులు చేస్తూ తెగ హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

వింత డ్రెస్‌తో అందాల ఆరబోత

వింత డ్రెస్‌తో అందాల ఆరబోత


సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోన్న దీపికా పదుకొనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని అందాల విందు చేసింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్ అన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో ఆమె పేరు మారుమ్రోగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X