ప్రభాస్ సినిమా కోసం ఆ హీరోయిన్‌కు భారీ రెమ్యునరేషన్.. మిడియం రేంజ్ హీరోల కంటే ఎక్కువే..
సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ రెమ్యునరేషన్ అనేది చాలా స్లోగా పెరుగుతోంది. కొన్నిసార్లు హీరోలతో సమానంగా కష్టపడి వర్క్ చేస్తున్నప్పటికీ వారికి ఇచ్చే దాంట్లో సగం కూడా ఇవ్వడం లేదని చాలామంది హీరోయిన్స్ డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ రెమ్యునరేషన్ నెంబర్లు చూస్తుంటే త్వరలోనే హీరోలతో సమానంగా డిమాండ్ చేసేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ప్రభాస్ సినిమా కోసం దీపికా పదుకొనె తీసికుంటున్న రెమ్యునరేషన్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అంతకుమించి అనేలా..
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాను ఓం రావత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. రామాయణం బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతుండడం వలన ఒక్కసారిగా అంచనాలు లేరిగిపోయాయి. ఇక ఆ తరువాత అంతకు మించి అనేలా నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తెరకెక్కించనున్నాడు.

హాలీవుడ్ లో కూడా
ఆ సైన్స్ ఫిక్షన్ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ నెవర్ బిఫోర్ అనేలా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 500కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ అయితే ఇచ్చేశారు. అందుకే అమితాబ్ బచ్చన్ , అలాగే దీపికా లదుకొనే వంటి స్టార్స్ ను సెలెక్ట్ చేసుకున్నారు.

హీరోయిన్ రెమ్యునరేషన్
సినిమా బడ్జెట్ ఆ రేంజ్ లో ఉంటే తారల రెమ్యునరేషన్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అనే విషయంపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక దీపికా పదుకొనెకు కూడా భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు ఒక మీడియం రేంజ్ హీరోకు ఇచ్చే పారితోషికం ఇస్తున్నారట. 8కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్ అయితే వస్తోంది.

అమితాబ్ బచ్చన్ కు ఎంతంటే?
వైజయంతి మూవీస్ కూడా ఆమె అడిగిన వెంటనే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇక అమితాబ్ బచ్చన్ మొదటిసారి తెలుగు పాన్ ఇండియా సినిమాలో ఫుల్ లెన్త్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు కూడా 4కోట్లకు పైగానే ఇస్తున్నారట. రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా యాక్టర్స్ ను సెలెక్ట్ చేసుకున్న నాగ్ అశ్విన్ మరి సినిమాలో వారిని ఎంతవరకు వాడుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











