‘పెళ్లికి ముందు శృంగారం.. పెళ్లి కాకుండా పడక సుఖం నా ఇష్టం’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ గురించిన వార్తలు, వివాదాస్పద అంశాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఆమెను కొందరు విపరీతంగా టార్గెట్ చేస్తున్నారనే విషయం అనేక రకాల పోస్టుల ద్వారా స్పష్టమవుతున్నది. గతంలో ఆమె చేసిన స్పీచ్‌లు, ఇంటర్వ్యూల వీడియో క్లిప్పులను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆమె ద్వంద ప్రమాణాలు పాటిస్తారనే విషయాన్ని రుజువు చేయడానికి ఇలాంటి వీడియోలను పోస్టు చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతున్నది. అయితే ఇలాంటి నెగిటివ్ ప్రచారం వెనుక అసలు కారణం ఏమిటంటే?
దీపిక పదుకోన్ స్వయంకృతాపరాధం వల్లే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారానే వాదన సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నది. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జేఎన్‌యూ(JNU)లో ఆమె చేసిన ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు ఆమె ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ విషయంలో ఆమెను చాలా మంది ట్రోల్ చేయడం తెలిసిందే. ఆ ఘటన చాలాకాలం ఆమెను వెంటాడిందనే చెప్పాలి.

ఇక సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషన్‌లో రానున్న స్పిరిట్ సినిమా కోసం ముందుగా దీపిక పదుకోన్‌ను ఎంపిక చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె కోరిన గొంతెమ్మ కోరికల కారణంగా ఆమెను ఆ సినిమా నుంచి తప్పించారు. అయితే దాంతో ఆ వ్యవహారం ఇంటర్నెట్, సోషల్ మీడియాలను కుదిపేసింది. రెమ్యునరేషన్, ఇతర డిమాండ్లు సమంజసంగా లేదనే ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
అయితే తాజాగా ఇలాంటి వివాదాలు కొనసాగడం, రణ్‌వీర్ సింగ్ డాన్ 3 వివాదం సరికొత్తగా తెరపైకి రావడంతో దీపిక పదుకోన్‌ను మళ్లీ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. రణ్‌వీర్ సింగ్, దీపిక ఇద్దరి మధ్య సంభాషణ, అలాగే పెళ్లికి ముందు ప్రియుడితో శృంగార జీవితం విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి.
గతంలో దీపిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లికి ముందు శృంగారం చేయడం తప్పే. ఒకరకమైన పాపమే. పెళ్లికి ముందు శృంగారం అనేది నన్ను మానసికంగా దెబ్బ తీసింది. పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది నా ఛాయిస్. అలాగే పెళ్లికి ముందు శృంగారం.. పెళ్లి చేసుకోకుండా శృంగారమనేది నా వ్యక్తిగత ఇష్టం అని అన్నారు.
రణ్‌బీర్ సింగ్‌తో డేటింగ్ చేసే సమయంలో ఇతర వ్యక్తులతో ఆకర్షణకు లోనయ్యాను. కానీ నేను రణ్‌వీర్‌కు మాత్రమే కమిట్ అయ్యాను. ఎవరితో కలిసినా నేను ఆయన గురించే ఆలోచించే దానిని అని దీపిక అంటే.. మేము డేటింగ్ చేసే సమయంలో ఆరు నెలల కాలంలో ఇద్దరు ముగ్గురిని కలిసింది. దీపిక కలిసిన వారేవరో ఆమెకు గుర్తుకు లేకపోవచ్చు. కానీ నాకు మాత్రం గుర్తుంది అని కరణ్ జోహర్ షోలో అన్నారు.


Click it and Unblock the Notifications