హాలీవుడ్ మరోసారి దీపిక పదుకొన్ ఎంట్రీ.. క్రేజీ సబ్జెక్ట్‌తో నిర్మాతగా కూడా మ్యాజిక్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ మరోసారి హాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఓ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ కొద్దికాలంగా హాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా మరోసారి హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు దీపక సిద్ధమయ్యారు. అయితే నటిగానే కాకుండా నిర్మాతగా కూడా దీపక పదుకోన్ వ్యవహరించడం ఇప్పుడు విశేషంగా మారింది. అయితే ఆ సినిమా కథ ఏంటి? ఏ బ్యానర్‌పై సినిమాను రూపొందిస్తున్నారనే విషయంలోకి వెళితే..

2017లో విన్ డీజిల్‌తో కలిసి
హాలీవుడ్ నటుడు విన్ డిజిల్‌తో జంటగా దీపిక పదుకోన్ నటించిన xXx: Return of Xander Cage చిత్రం రూ.80 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందింది. 2017లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సుమారు 346 మిలియన్ డాలర్లను వసూలు చేయడం రికార్డుగా పేర్కొనవచ్చు. ఈ సినిమా మంచి పేరు తెచ్చినప్పటికీ దీపిక పదుకోన్ హాలీవుడ్ చిత్రాల్లో నటించే విషయంలో ఆచితూచి వ్యవహరించింది.

మరోసారి హాలీవుడ్‌లోకి దీపిక
ప్రస్తుతం దీపిక పదుకోన్ STX films రూపొందించే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమాను తన సొంత బ్యానర్ Ka ప్రొడక్షన్స్‌పై నిర్మించనున్నారు. ఈ మూవీ క్రాస్ కల్చరల్ రొమాంటిక్ కామెడీగా రూపొందనున్నది. ఈ సినిమా గురించి వార్తను దీపిక పదుకోన్ స్వయంగా ధృవీకరించారు.

గ్లోబల్ అప్పీల్ ఉన్న కంటెంట్‌తో
హాలీవుడ్‌లో నేను నటించబోయే సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ STX films తో భాగస్వామ్యం అయ్యానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాను. గ్లోబల్ అప్పీల్, మంచి కంటెంట్‌తో ఉన్న చిత్రాలను రూపొందించేందుకే కేఏ ప్రొడక్షన్స్ రూపొందించాను. STXfilms, Temple Hill Productions లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. గ్లోబల్ టచ్ ఉన్న సినిమాను రూపొందించే అవకాశం రావడం మరింత ఆనందంగా ఉంది అని దీపిక పదుకోన్ తెలిపింది.

కేఏ ప్రోడక్షన్స్ స్థాపించి.. యాసిడ్ దాడి ఘటనను..
ఇక దీపిక పదుకోన్ కేఏ ప్రొడక్షన్ విసయానికి వస్తే. 2018లో ఈ సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. యాసిడ్ దాడి బాధితురాలి కథతో ఛపాక్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా హాలీవుడ్ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమైంది. హాలీవుడ్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా కథంతా దీపిక పదుకోన్ పాత్ర చుట్టే తిరుగుతుంది అని STXfilms, Temple Hill Productions ఓ ప్రకటనలో తెలిపాయి.
Recommended Video

దీపిక పదుకోన్ కెరీర్ ఇలా..
ఇక దీపిక పదుకొన్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన కపిల్ దేవ్ బయోపిక్ 83 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో నటించడం ద్వారా దీపిక పదుకొన్ తెలుగులో అడుగుపెట్టనున్నారు. అలాగే శకున్ బాత్రా చిత్రంలో, షారుక్ ఖాన్‌తో పఠాన్, రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్ అనే మరో చిత్రంలో


Click it and Unblock the Notifications











