For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సోదరి లవర్‌తో దీపిక పదుకొనే శృంగారం: ఆమె క్యారెక్టర్‌పై సెన్సేషనల్ లీక్.. బీటౌన్‌లో హాట్ టాపిక్‌

  |

  ఏమాత్రం అంచనాలు లేకుండా సినిమా రంగంలోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే ఊహించిన స్థాయికి ఎదిగిపోయింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి సినిమాల్లో నటించిన ఆమె.. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అదే సమయంలో ప్రేమ కహానీల కారణంగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, తాజాగా దీపిక క్యారెక్టర్ గురించి బాలీవుడ్‌లో ఊహించని న్యూస్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలైన కెరీర్.. స్టార్ హీరోయిన్‌గా

  అలా మొదలైన కెరీర్.. స్టార్ హీరోయిన్‌గా

  తన తండ్రి ప్రకాశ్ పదుకొనేలా బాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలనుకున్నా.. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది దీపిక పదుకొనే. ఈ క్రమంలోనే ‘ఐశ్వర్య' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత షారూఖ్ ‘ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోందీ అమ్మడు.

  ఆ క్రికెటర్లతో ప్రేమాయణం సాగించి హైలైట్

  ఆ క్రికెటర్లతో ప్రేమాయణం సాగించి హైలైట్

  కెరీర్ ఆరంభంలోనే దీపిక పదుకొనే మంచి గుర్తింపును దక్కించుకుంది. అదే సమయంలో లవ్ ట్రాకుల కారణంగా దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోయింది. అప్పట్లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో ఓ యాడ్ చేసింది. అప్పుడు అతడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత మరో క్రికెటర్ యువరాజ్ సింగ్‌తోనూ ప్రేమాయణం సాగించింది. వీళ్లిద్దరి తర్వాత విజయ్ మాల్యా కుమారుడితోనూ డేటింగ్ చేసింది.

  ఆ హీరోతో డేటింగ్.. మరో హీరోతో వివాహం

  ఆ హీరోతో డేటింగ్.. మరో హీరోతో వివాహం

  క్రికెటర్లతో ప్రేమాయణం సాగించిన తర్వాత దీపిక పదుకొనేపై విమర్శలు కూడా వచ్చాయి. అప్పుడు కొన్నేళ్ల పాటు కెరీర్‌ మీదే దృష్టి సారించింది. దీంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. సరిగ్గా ఆ సమయంలోనే రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్ చేసింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పి రణ్‌వీర్ సింగ్‌ను వివాహమాడింది.

  పెళ్లి తర్వాత ఫుల్ బిజీ... భర్తతో కలిసి 83

  పెళ్లి తర్వాత ఫుల్ బిజీ... భర్తతో కలిసి 83

  వివాహం తర్వాత మరింత స్పీడు పెంచిన దీపిక పదుకొనే.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా భారీ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో భర్తతో కలిసి కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటిస్తోంది. దీంతో రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ మూవీ ‘83'లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటిస్తోంది.

  తెలుగులోకి ఎంటర్ అవ్వబోతున్న దీపిక

  తెలుగులోకి ఎంటర్ అవ్వబోతున్న దీపిక

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ‘మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ రూపొందిస్తోన్న ఈ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. దీని కోసం దీపికకు భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్‌గా ఇస్తున్నారని టాక్.

  ఆమె క్యారెక్టర్‌పై సెన్సేషనల్ న్యూస్ లీకైంది

  ఆమె క్యారెక్టర్‌పై సెన్సేషనల్ న్యూస్ లీకైంది


  దీపిక పదుకొనే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే కబీర్ ఖాన్ మూవీ ‘83' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. అదే సమయంలో ఆమె షారూఖ్ ఖాన్‌తో ‘పఠాన్' అనే సినిమా చేస్తుంది. దీనితో పాటు హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్' అనే మూవీలోనూ, షకున్ బాత్రా చిత్రంలోనూ నటించబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీపిక క్యారెక్టర్‌పై సెన్సేషనల్ న్యూస్ లీకైంది.

  Prabhas ప్యాన్ ఇండియా స్టార్ నుండి Universal Star గా మారుతాడు | #PrabhasNagshwin || Filmibeat Telugu
  సోదరి లవర్‌తో దీపిక పదుకొనే శృంగారం

  సోదరి లవర్‌తో దీపిక పదుకొనే శృంగారం

  షకున్ బాత్రా తెరకెక్కించబోతున్న సినిమాలో దీపిక పదుకొనే పాత్ర ఊహించని విధంగా ఉంటుందట. ఇందులో ఆమె సోదరి అయిన అనన్య పాండే ప్రియుడితో ఓ సందర్భంలో శృంగారం చేస్తుందట. అప్పటి నుంచి కథ మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. తర్వాత దీపికకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే పాయింట్‌తో సినిమాను తీస్తున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  English summary
  Deepika Padukone is an Indian actress and producer who works in Hindi films. One of the highest-paid actresses in India, her accolades include three Filmfare Awards. She features in listings of the nation's most popular personalities, and Time named her one of the 100 most influential people in the world in 2018.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X