దీపికా పదుకొణెకు జెనీలియా కౌంటర్.. 10 గంటలు కూడా పని చేస్తే తప్పేంటీ ?
తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు దక్కించుకుంది జెనీలియా. క్యూట్ లుక్స్ తో, చిలిపి మాటలతో, ఎప్పుడూ పసి హృదయంతో కనిపిస్తూ ఆకట్టుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకుంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. విభిన్న చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా దక్కించుకుంది. ఇక కొన్నాళ్లుగా జెనీలియా హిందీ చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. నార్త్ ఆడియెన్స్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. కాగా తాజాగా జెనీలియా పేరు వార్తల్లో నిలిచింది. దీపికా పదుకొణె మాటలకు కౌంటర్ గా స్పందించినట్టు ఆమె సమాధానాలు ఉన్నాయి.
జెనీలియా తెలుగు సినిమాలు..
టాలీవుడ్ లో జెనీలియా చాలా సినిమాల్లో నటించింది. 2003 నుంచి 2012 వరకు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. 2003లో విడుదలైన సత్యం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అప్పటికే తమిళంలో బాయ్స్ అనే చిత్రంతో బ్లాక్ బాస్టర్ అందుకుంది. దక్షిణాదిన హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఇక టాలీవుడ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని, రానా దగ్గుబాటి వంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. సత్యం, సై, నా అల్లుడు, హ్యపీ, బొమ్మరిల్లు, ఢీ, ఆరెంజ్, నా ఇష్టం వంటి చిత్రాల్లో నటించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ఉంది.

దీపికా పదుకొణె వివాదం..
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై కన్నేసింది. ఇక్కడ ఏ భారీ ప్రాజెక్ట్ ఉన్నా గానీ ముందుగా దీపికా పదుకొణె వద్దకు వెళ్తుంది. ఈక్రమంలోనే డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దీపికా పదుకొణె ను సంప్రదించారు. స్టోరీ కూడా చెప్పారు. కానీ వర్కింగ్ హవర్స్, రెమ్యునరేషన్ విషయంలో తేడాలు వచ్చాయి. అది కాస్తా వారి వివాదం బయటికి వచ్చింది. దీంతో పనివేళల విషయంలో దీపికా పదుకొణె చాలా కండీషన్స్ పెట్టిందని వార్తలు గుప్పుమన్నాయి. ఆ కొద్దిరోజులకు సమస్య సర్దుమణిగింది. కానీ పని వేళలపై సెలబ్రెటీలు పలు సందర్భాల్లో స్పందిస్తూనే వస్తున్నారు.
జెనీలియా కౌంటర్ ఇదేనా?
పనివేళలపై దీపికా పదుకొణె వివాదం తర్వాత సినీ తరాలు ఆయా సందర్భాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాజోల్ స్పందించింది. దీపికాకు ఫేవర్ గా మాట్లాడింది. ఇక రానా దగ్గుబాటి స్పందించి సందీప్ కు మద్దతుగా నిలిచారు. తాజాగా స్టార్ హీరోయిన్ జెనీలియా రియాక్ట్ అయ్యింది. తను గతంలో 10 గంటలు కూడా పనిచేశానని చెప్పింది. డైరెక్టర్ అగిడితే, అవసరమైతే 12 గంటలు కూడా పని చేసిన సందర్భాలున్నాయిని చెప్పుకొచ్చింది. సినిమాకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో 10 గంటలు పనిచేస్తే తప్పేమీ లేదు కదా అని స్పందించింది.
దీపికా పదుకొణె రాబోయే చిత్రాలు..
ఇక దీపికా పదుకొణె ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించింది. రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన AA26xA6 చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు కల్కి 2, షారుఖాన్ కింగ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా దీపికా పదుకొణె లైనప్ లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











