Deepika Padukone దీపిక పదుకోన్‌కు ‘ఆస్కార్’ అరుదైన గౌరవం.. ట్రెండింగ్ వీడియోతో కల్కి బ్యూటీ చరిత్ర!
బాలీవుడ్ భామ దీపిక పదుకోన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందనే విషయం మరోసారి రుజువైంది. ప్రపంచంలో నోబెల్ బహుమతిగా భావించే ఆస్కార్ అవార్డుల నిర్వాహకులు ఆమెకు అరుదైన గౌరవాన్ని అందించారు. అకాడమీ అవార్డులకు సంబంధించిన ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌లో దీపిక సినిమాకు చెందిన ఓ వీడియో పాటను పోస్టు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
దీ3పిక పదుకోన్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించి మెప్పిస్తున్నది. ఇటీవల రిలీజైన ఫైటర్ చిత్రం అటు బాక్సాఫీస్ వద్ద.. ఇటు ఓటీటీలోను రికార్డు వ్యూస్ సాధిస్తున్నది. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ఫైటర్ చిత్రం 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓటీటీలో 11 రోజుల్లో 34 మిలియన్ల వ్యూస్ మినట్స్‌ను సాధించింది.

ఇదిలా ఉండగా, ఫైటర్ సినిమా తర్వాత ఆమె నటించిన ప్రాజెక్ట్K అలియాస్ కల్కి చిత్రంలో నటిస్తున్నది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకొనేందుకు రెడీ అయింది. ఈ సినిమా మే 30వ తేదీన రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది.
అయితే సినిమాలతోను బిజీగా ఉంటూనే అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను, సత్తాను చాటుకొంటున్నది. ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ప్రజెంటర్‌గా వ్యవహరించే అపూర్వమైన ఆవకాశాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా.. ప్రతిష్టాత్మక వేదికపై తన అందాలు, టాలెంట్‌తో హాలీవుడ్ స్టార్లను ఆకట్టుకొన్నది.

ఇదిలా ఉండగా, దీపిక పదుకోన్‌కు అరుదైన గుర్తింపు ఇచ్చేందుకు ఆస్కార్ సంచలన నిర్ణయం తీసుకొన్నది. ఆమె నటించిన బాజీరావు మస్తానీ సినిమాలో శ్రేయా ఘోషల్ పాటిన దీవానీ మస్తానీ పాటకు సంబంధించిన వీడియోను, ఓ ఫోటోను తమ అధికారిక ఇన్స్‌టాగ్రామ్ పేజిలో పోస్టు చేసింది. ఆ పోస్టుపై భర్త రణ్‌వీర్ సింగ్ కనికట్టు అంటూ కామెంట్ చేశాడు.
ఇక దీపిక పదుకోన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇటీవల ఆమె గర్బవతి అయింది. త్వరలోనే రణ్‌వీర్ సింగ్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా మీడియాకు వెల్లడించారు. వారసుడు, వారసురాలి రాకకు ముందు ఇలాంటి గొప్ప గౌరవం లభించడం శుభసూచకం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











