Deepika Padukone in ProjectK.. దీపిక పదుకోన్ ఫస్ట్ లుక్ రెడీ.. వయ్యారాలు ఒలకబోస్తున్న ప్రభాస్ డార్లింగ్
తెలుగు సినిమా ప్రపంచంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. సైన్స్, ఫిక్షన్ అంశాలతో రూపొందుతున్న చిత్రం భారీ హంగులతో తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపిక పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి అగ్రతారలు ఈ సినిమాలో భాగమయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్‌ను వైజయంతీ మూవీస్ విడుదల చేసింది. ProjectK మూవీ సినిమా, దీపిక పదుకోన్ లుక్ వివరాల్లోకి వెళితే..
ProjectK చిత్రాన్ని భారతీయ సినిమా చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఈ సినిమాను సుమారు 600 కోట్ల రూపాయలతో రూపొందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా, సంతోష్ నారాయణ్, కోటగిరి వెంకటేశ్వరరావు లాంటి దిగ్గజ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు.

ProjectK చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. టైమ్ మిషన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నందున్న ఎవరూ ఊహించిన విధంగా వాహనాలను డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మహీంద్ర అండ్ మహీంద్ర కొత్త కొత్త డిజైన్లతో వాహనాలను రూపొందిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత గ్రాఫిక్స్‌తో టైమ్ మిషన్, ఫ్యూచర్‌లో ఉండే వాహనాలకు రూపం కల్పిస్తున్నారు.

ProjectK సినిమాకు సంబంధించిన టైటిల్స్ పేర్లు రకరకాలుగా వినిపిస్తున్నాయి. K అంటే కాల చక్ర అని మీడియాలో ప్రచారం అవుతున్నది. ఈ సినిమాకు కాలచక్రతోపాటు మరో పేరును కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే ProjectK అంటే ఏమిటి అనే విషయాన్ని టీమ్ వెల్లడించేందుకు సిద్దమవుతున్నద.ి

అయితే ProjectK చిత్రం శరవేగంతో రూపుదిద్దుకొన్నంటున్న నేపథ్యంలో తొలిసారి దీపిక పదుకోన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడానికి వైజయంతీ మూవీస్ సిద్దమవుతున్నట్టు సమాచారం. వైజయంతీ మూవీస్ ట్విట్టర్ పేరుతో ఉన్న అకౌంట్‌తో దీపిక పదుకోన్ ఫోటోను షేర్ చేశారు. దీపిక పదుకోన్ ఫస్ట్ లుక్‌ను జూలై 20వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వైజయంతీ మూవీస్ ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేసిన ఫోటో.. రాజసం ఉట్టిపడుతున్న యువరాణిలా దీపిక పదుకోన్ కనిపిస్తున్నది. బ్రా లేకుండా చీరకట్టులో అప్సరసలా భంగిమల కనిపింింది. తలపై విచిత్ర రూపంలో ఉన్న కిరీటంతో అందంగా కనిపించారు. ఆ పక్కనే ఉన్న జలపాతం ఒడ్డున కూర్చొని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు కనిపించింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 సంవత్సరం జనవరి 12వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ప్యాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











