దీపికా పిల్లి షాకింగ్ రెమ్యునరేషన్.. ఆమె ఆదాయం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే
యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన దీపికా పిల్లి ప్రస్తుతం హీరోయిన్ గా సినిమా ఆఫర్లను దక్కించుకుంటోంది. టెలివిజన్ రంగంతో ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ పరిచయం అయ్యింది. ఢీ13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోలో కంటెస్టెంట్ గా పార్టిసీపేట్ చేసి అలరించింది. అలాగే ఢీ, శ్రీదేవిడ్రామా కంపెనీ షోల్లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆకట్టుకుంది. ఆహాలో వచ్చిన కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ షోకు యాంకర్ గా వ్యవహరించి టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. యాంకర్ గా, మోడల్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయేన్సర్ గా ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉండింది.
ఇక ప్రస్తుతం హీరోయిన్ గా డెబ్యూ ఫిల్మ్ తో అలరించబోతోంది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా, దీపికా పిల్లి హీరోయిన్ గా రూపుదిద్దుకున్న విలేజ్ లవ్ స్టోరీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం కంటే ముందు దీపికా పిల్లి 'వాంటెడ్ పండుగాడు' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించింది. సుడిగాలి సుధీర్ సరసన మెరిసిన సంగతి తెలిసిందే.

అయితే, ఫుల్ లెన్త్ ఫీమేల్ లీడ్ లో దీపికా పిల్లి ప్రస్తుతం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి నితిన్-భరత్ జంట దర్శకత్వం వహించారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై నిర్మించారు. రాధన్ సంగీతం అందించారు. శ్రీరామ నవమి సందర్భంగా చిత్రానికి సంబంధించిన మేలోడీ ట్రాక్ ను విడుదల చేశారు. ఇలా ప్రచార కార్యక్రమాలను మాత్రం జోరుగా నిర్వహిస్తోంది టీమ్. ఇదిలా ఉండగా.. దీపికా పిల్లి రెమ్యునరేషన్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రానికి ప్రదీప్ మాచి రాజ్ మాత్రం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారని ఆయనే స్వయంగా చెప్పారు. నిర్మాతలు తన స్నేహితులు కావడంతో ఏమీ ఆశించకుండా, పైగా మంచి సినిమా కావడంతో రెమ్యునరేషన్ తీసుకోలేదని చెప్పారు. దీంతో దీపికా పిల్లి తన మొదటి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె కేవలం ఇన్ స్టా గ్రామ్ ద్వారానే నెలకు రూ.25 లక్షల వరకు సంపాదిస్తుందని ఆడిట్ పండింతులు తెలుపుతున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో 2.9 మిలియన్ల యూజర్స్ ఉండటం విశేషం.
ఇక సినిమాకు కూడా దీపికా పిల్లి అదే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుందని అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంతనేది తెలియాల్సి ఉంది. అందంలో అందరినీ ఆకట్టుకున్న దీపికా పిల్లి ఇక పెర్ఫామెన్స్ తో మెప్పించగలిగితే మాత్రం ఆమెకు టాలీవుడ్ లో మంచి పాత్రలు అందే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ ఇతర పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీని ఎంఎన్ బాల్‌రెడ్డి నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











