బూరెల బుట్టలో పడ్డ ప్రియాంకా చోప్రా, మ్యాట్రిక్ 4లో తళుక్కుమనే అవకాశం
అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లాడాక దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రాకు భలే కలసి వస్తోందంటే నమ్మండి. అమ్మాయి ఏం పట్టినా బంగారమే అవుతోంది. లాక్ డౌన్ కారణంగా కాస్త వెనక్కు తగ్గిన పిగ్గీ చాప్స్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది. నిన్న గాక మొన్నే ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ తో మల్టీ మిలియన్ ప్రాజెక్ట్ ను ఓకే చేసిన ప్రియాంకా తాజాగా మరో బంపర్ ఆఫర్ పట్టేసింది.
మ్యాట్రిక్స్ అన్న పేరు వింటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరూ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు వీరి జాబితాలోకి ప్రియాంకా చోప్రా పేరు కూడా చేరనుంది. ఎందుకంటే, మ్యాట్రిక్స్ 4లో మన దేశీ బ్యూటీ కీలక పాత్ర పోషించబోతోందట. ఇక ఈ సినిమా ద్వారా యూనివర్సల్ హీరోగా మారిపోయిన కెనూ రీవ్స్ తో అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని తెలుస్తోంది.

అసలు ఇప్పటికే సినిమా పట్టాలెక్కాల్సి ఉన్నా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. లానా వచౌస్కీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంల కెనూ రీవ్స్ తో పాటూ, క్యారీ ఆన్ మాస్, యహాయా అబ్దుల్ , నీల్ ప్యాట్రిక్ నటించనున్నారు. వీరితో దేశీ గర్ల్ కూడా కనువిందు చేయనుంది. ఏప్రిల్ 4, 2022 లో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











