'ఎలాంటి ఐటెం సాంగ్ కైనా రెడీ.. అలాంటి పాత్రలకు సిద్ధం'
Devara Actress Latha Vishwanath: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'దేవర' మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీలో సైఫ్ ఆలీ ఖాన్ భైర అనే విలన్ పాత్రలో నటించగా అతని కొడుకు పసురా కు చంద్రకళ అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది. ఆ హాట్ లూక్ పాత్రలో తెలుగు అమ్మాయి లతా విశ్వనాథ్ రెడ్డి నటించి, మెప్పించింది. చంద్రకళ అనే పాత్ర లో లతా విశ్వనాథ్ రెడ్డి కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. ఈ అమ్మడు కనిపించింది రెండు, మూడు సీన్లలో అయినా తన హాట్‌నెస్‌తో ఫెవరెట్‌గా యూత్ మారిపోయింది లతా విశ్వనాథ్ రెడ్డి . ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ లో నటించడం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీరు కూడా ఓ లూక్కేయండి.
తెలుగు అమ్మాయి లతా విశ్వనాథ్ రెడ్డి..అంతకు ముందు HIT 2, 'వాల్తేరు వీరయ్య', 'సర్కారు నౌకరి', 'బాలుగాని టాకీస్' వంటి సినిమాల్లో సైడ్ రోల్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది లతా విశ్వనాథ్ రెడ్డి. దేవర మూవీ తో లతా రెడ్డి స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. అటు సోషల్ మీడియాలో కూడా లతా రెడ్డికి అద్భుతమైన ఫాలోయింగ్ వచ్చింది. తన కెరీర్ , పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను, తన హాట్ ఫొటోలు నెట్టింట్లో షేర్ చేస్తు.. కుర్రాకారు మంత్రముగ్దులను చేస్తుంది. అలాగే వరుస సినిమా ఆఫర్ అందుకుంటూ.. బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నారు.

దేవర ఫేమ్ లతా విశ్వనాథ్ రెడ్డి తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని, దేవర మూవీలో నటించిన తన అదృష్టమని, కానీ హీరో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయారని బాధపడ్డారు. ఫ్యూచర్లో అవకాశం ఉంటే తాను ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తనకు ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించాలని కోరికగా ఉందని, జస్ట్ రెండు లేదా మూడు సీన్స్ నటించిన లైఫ్ ఫుల్ ఫీల్ అయిందని భావిస్తానన్నారు. అలాగే కాంతారా హీరో రిషబ్ శెట్టి సరసన రొమాన్స్ చేయాలని, తన కోరికను బయటపెట్టింది నటి లతా విశ్వనాథ్.
తనకు ఎన్టీఆర్ దేవరతో ఎంతో మంచి క్రేజ్ వచ్చిందని ఆ క్రేజ్ తో తనకు వరుసగా ఆ పర్స్ వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమాలలో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు వస్తున్నాయని, కొంతమంది తనని లీడ్ రోల్స్, సైడ్ హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశం ఇస్తున్నారని, తాను ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎందుకంటే ఇండస్ట్రీలోకి తాను ఆర్టిస్ట్ అవుదామని వచ్చానని, అది ఏ పాత్రలోనైనా.. తనను తాను నిరూపించుకోవాలని భావిస్తున్నానన్నారు లతా విశ్వనాథ్ రెడ్డి . అలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలో నటించడం కాస్త ఇబ్బందిగా ఉన్న.. తనకు నటన వచ్చు కాబట్టి ఈజీనే అంటూ లతా రెడ్డి సెటైరికల్ గా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











