Janhvi Kapoor శ్వేత వర్ణ దుస్తుల్లో అప్సరసలా.. అందాలతో జిగేల్ అనిపిస్తున్న జాన్వీకపూర్!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటి శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఒడిదుడుకులను కొనసాగిస్తున్నది. గత ఆరేళ్లుగా భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నది. కానీ సోలో హీరోయిన్‌గా చేసిన పాత్రలు ఆమెకు సక్సెస్‌ను తెచ్చిపెట్టలేకపోయింది. సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ధడక్ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన జాహ్నవి కపూర్ భారీ సక్సెస్ అందుకొన్నది. ఆ తర్వాత వచ్చిన ఘోస్ట్ స్టోరీస్, గంజన్ సక్సెనా, రూహీ, గుడ్ లక్ జెర్నీ, మిలి, బవల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఘోర పరాజయాన్ని పొందాయి. అయితే ఆమె కెరీర్ గ్రాఫ్‌ను మాత్రం ఏ మాత్రం తగ్గించలేకపోయాయి.

Devara fame Janhvi Kapoor looks Stunning and Sizzles in Pearl Embeded White Dress is Trending in Instagram

అయితే తాజాగా కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న దేవర సినిమా ద్వారా దక్షిణాదికి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అందం, అభినయానికి స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు ఆమెకు భారీగా అభిమానులను సంపాదించిపెట్టాయి. అంతేకాకుండా ఈ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచాయి.

ఇదిలా ఉండగా, తెలుగులో తొలి సినిమా రిలీజ్ కాకుండానే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించే అవకాశం దక్కించుకొన్నది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో జాహ్నవి నటిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి బోనికపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అధికారికంగా ధృవీకరించారు.

ఇక తాజాగా జాహ్నవి కపూర్ చేసిన ఫోటోషూట్ వైరల్‌గా మారింది. శ్వేత వర్ణ దుస్తులతో మిలమిలా మెరుస్తూ కెమెరాకు ఫోచిచ్చింది. ముత్యాల హారాలతో తయారు చేసిన దుస్తులను ధరించింది. ముత్యాలు పొదిగిన దుస్తుల్లో అప్సరసలా కనిపించింది. ఆమె పోస్టు చేసిన ఫోటోలకు 7 లక్షలకుపైగా లైక్ కొట్టారు. వేల సంఖ్యలో కామెంట్లు పెట్టారు.

Devara fame Janhvi Kapoor looks Stunning and Sizzles in Pearl Embeded White Dress is Trending in Instagram

అప్సరలా అలకరించుకొని జాహ్నవి కపూర్ దిగిన ఫోటోలకు సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతున్నది. అప్సరసను మించిన అందం ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నెటిజన్లు ఆమె అందానికి నీరాజనం పడుతున్నారు. రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X