దేవర ఓటిటి రిలీజ్ తర్వాత జాన్వీపై ట్రోల్స్.. ఆ విషయంలో ఆడుకుంటున్న నెటిజన్స్
ఈ ఏడాదిలో తెలుగు సినిమా ఇచ్చిన భారీ హిట్ చిత్రాల్లో రికార్డు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు రెండు ఉన్నాయి. మరి వాటిలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఒకటి కాగా మరొకటి మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ "దేవర" అని చెప్పాలి. కాగా కల్కి సినిమా ఏకంగా 1100 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని ప్రభాస్ కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిస్తే..
ఇపుడు దేవర 500 కోట్లకి పైగా గ్రాస్ అందుకొని తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి అదరగొట్టింది. కాగా సినిమా వసూళ్ల పరంగా చాలా మందికి కంప్లైంట్స్ ఉండొచ్చు కానీ మేకర్స్ ఫైనల్ గా ఇచ్చిన పోస్టర్ తో అయితే దేవర 500 కోట్ల గ్రాస్ క్లబ్ లో జాయిన్ అయ్యింది. మరి థియేటర్స్ లో రన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటి ఎంట్రీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.

పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో దేవర పాన్ సౌత్ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా తోనే బాలీవుడ్ హాట్ అందాల భామ జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తల్లి అలనాటి అందాల నటి శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తే ఆమె వారసురాలు ఇపుడు మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
కాగా ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్ మంచి డెబ్యూ అందుకోగా బిగ్ స్క్రీన్స్ పై కూడా జాన్వీ హీటెక్కించింది. ఇలా అప్పుడు ఒక రెస్పాన్స్ ని ఈమె అందుకుంటే ఇపుడు సినిమా ఓటిటిలో వచ్చాక మాత్రం ట్రోల్స్ కి గురవుతుంది అని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ కి ముందు దర్శకుడు కొరటాల శివ జాన్వీ కపూర్ దేవర సినిమా కోసం చాలా డేడికేట్ గా పని చేసింది అని సినిమాలో ఒక సీన్ ని రెండు పేజీల డైలాగ్ ని అవలీలగా చెప్పేసింది అంటూ ఆమెని ఆకాశానికి ఎత్తేసారు.

అయితే ఇపుడు ఆ సీన్ ఎక్కడ ఉంది అంటూ నెటిజన్స్ ఓటిటిలో సినిమా చూసాక ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా మొత్తంలో జాన్వీకి కొన్ని డైలాగ్స్ మాత్రమే ఇచ్చారు అని నాకు తెలుసు, విషయం ఉంది లేదు వీటికే సరిపెట్టేసారు అని అలాగే ఆమెని కేవలం గ్లామర్ రోల్ కోసం తీసుకున్నారు తప్పితే సినిమాలో జాన్వీకి స్కోపే లేదు ట్రోల్స్ వినిపిస్తున్నాయి. మరి ఇపుడు బిగ్ స్క్రీన్స్ లో ఏమో కానీ ఇపుడు ఓటిటిలో వచ్చాక మాత్రం జాన్వీ పట్ల తెలుగు ఆడియెన్స్ ఈ రకం కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈమెపై ప్లాన్ చేసిన ఆ రెండు పేజీల డైలాగ్ పార్ట్ 2 లో గాని ఉంటుందో ఏమో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











