Devara: దేవర సక్సెస్ జోష్.. ప్రియుడితో జాన్వీ కపూర్ బీచ్ పార్టీ.. బికినీలో ఘాటైన అందాలు!
బాలీవుడ్ అందాల సుందరి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor) ప్రస్తుతం సక్సెస్ జోష్‌లో ఉన్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా కెరీర్ కొనసాగిస్తున్నప్పటికీ దేవర లాంటి హిట్‌ను ఆమె సొంతం చేసుకోలేకపోయింది. తెలుగులో తొలిసారి అడుగుపెట్టి.. తన కెరీర్‌లో బెస్ట్, హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన ఘనతను తన ఖాతాలో వేసుకొన్నది. దేవర అందించిన విజయంతో ప్రస్తుతం మాల్దీవుల్లో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో లభించని విజయం తన కెరీర్‌లో తొలిసారి లభించడంతో ఆమె ప్రస్తుతం తన కెరీర్‌పై ఫుల్లుగా ఫోకస్ పెట్టింది. దక్షిణాది ప్రేక్షకులు ఆదరించడంతో తెలుగు, తమిళ రంగాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాంచరణ్‌తో కలిసి బుచ్చిబాబు దర్వకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నది.

అయితే దేవర బ్లాక్ బస్టర్ కావడంతో సౌత్ ఇండస్ట్రీతోపాటు బాలీవుడ్ కూడా భామపై కన్నేసింది. బాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయనే విషయం మీడియాలో తరుచూ వినిపిస్తున్నది. ఇలాంటి జోష్ కనిపిస్తున్న నేపథ్యంతో ప్రియుడు శిఖర్ పనేరియాతో కలిసి వేకేషన్‌కు వెళ్లినట్టు తాను షేర్ చేసిన ఫోటోల ద్వారా వెల్లడించింది.
అయితే ఈ టూర్‌లో తన సోదరి ఖుషి కపూర్ కూడా ఉండటం గమనార్హం. తన చెల్లితో కలిసి బికినీలో సాయంత్రం సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. నేను చంద్రుడిని చూసినట్టు ఉంది. కానీ నేను మిమ్మల్ని మాత్రమే చూస్తున్నాను అని కామెంట్ చేసింది. జాన్వీ షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

జాన్వీ కపూర్ ( Janhvi Kapoor Photos)షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు కామెంట్ చేస్తూ.. సూర్యాస్తమయం అద్బుతంగా ఉంది. మీరు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా బికినీ గ్లామర్‌తో మమల్ని ఊచకోత కోయకండి. ఇంకా ఎక్కువ ఫోటోలు షేర్ చేయండి. మీకు ఫుల్ పిక్చర్ చూపించే దమ్ముందా? సగం సంగం అందాలే ఎందుకు చూపిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రియుడు శిఖర్ ఫోటోలు మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది. అయితే ఆ ఫోటోలు తీసింది నీ ప్రియుడు శిఖరా? అంటూ నెటిజన్లు చిలిపిగా ప్రశ్నిస్తున్నారు. అయితే తన సోదరితో కలిసి ఉన్న ఫోటో మాత్రం మీడియాలోను, ఇన్స్‌టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నది.
జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉల్జా సినిమాల్లో నటించింది. తాజాగా విడుదలైన దేవర బ్లాక్ బస్టర్ విజయం అందుకొన్నది. అలాగే తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా అనే చిత్రంలో అతిథి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన సన్నీ సంస్కారీ కి తులసి కుమారీ అనే చిత్రంలో నటించింది.


Click it and Unblock the Notifications











