రూల్స్ ఫాలో అవ్వనంటూ మొత్తం విప్పేసిందిగా .. సింగిల్ పీస్‌తో కవర్ చేస్తూ

సోషల్ మీడియా రాకతో ఎంతో మంది స్టార్స్‌గా అవతరించారు. టాలెంట్ ఉండి దానిని ఎలా బయటికి చూపించాలో అర్ధంకాక , అవకాశాలు ఎలా పొందాలో తెలియని వారికి ఇది ఒక ఫ్లాట్ ఫాంలా మారింది. ఎంతోమంది నటీనటులుగా, డ్యాన్సర్స్‌గా, డైరెక్టర్స్‌గా అవకాశం అందుకున్నారు. ఇలాంటి వారిలో ఢిల్లీ భామ దేవియాని శర్మ ఒకరు. క్యూట్ అందాలతో , పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్‌ అనిపించుకున్నారు.

ఢిల్లీకి చెందిన దేవియాని శర్మ .. కాలేజ్ డేస్‌లోనే మోడలింగ్ వైపు అడుగులు వేశారు. నటనపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండటంతో స్టేజ్‌పై నాటకాలు వేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ మూవీ లవ్ శుదా చిత్రంలో ఓ చిన్న రోల్ ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. ఈ క్రమంలో భానుమతి రామకృష్ణతో తెలుగువారిని పలకరించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ దేవియాని అందానికి, నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలా పూరి జగన్నాథ్ కళ్లలో పడ్డ ఈ ముద్దుగుమ్మను .. ఆయన తన కుమారుడు ఆకాష్ పురి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాలో ఓ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇందులో కేతిక శర్మ మెయిన్ హీరోయిన్ కావడం గమనార్హం.

Deviyani Sarma PhotoShoot with black color bikini Her latest photos here

సినిమా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఈమె టాలెంట్‌ను గుర్తించిన మేకర్స్ అవకాశాలు కల్పిస్తున్నారు. అనగనగా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, సేవ్ ది టైగర్స్ వంటి వెబ్‌ సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దేవియానిలో మంచి నటే కాకుండా చిత్రకారిణి కూడా ఉన్నారు. అద్భుతమైన పెయింటింగ్స్ వేయడంలో ఆమె దిట్ట. కళామాటిక్స్ పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసి తన పెయింటింగ్స్‌ను ప్రదర్శిస్తున్నారు.

ఇప్పటి వరకు పద్ధతిగా కనిపించిన దేవియాని శర్మ.. సైతాన్ అనే సిరీస్‌లో మాత్రం బోల్డ్‌గా మాస్ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలని భావిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కమర్షియల్ చిత్రాలతో పాటు కథాబలమున్న సినిమాల్లోనూ నటించాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. ఇక కొద్దిరోజుల క్రితం దేవియాని ఫోన్ హ్యాక్ కావడంతో ఆమె తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. తన వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల దగ్గరే ఉందని దేవియాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నెంబర్ నుంచి ఎవరికైనా మెసేజ్‌లు వస్తే స్పందించొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఏ విషయంపై అయినా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే దేవియాని శర్మ.. బోల్డ్ కామెంట్స్ చేయడానికి కూడా వెనుకాడరు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా బ్లాక్ కలర్ బికినీ ధరించిన దేవియాని .. తాను రూల్ బుక్ ప్రకారం వెళ్లనంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: deviyani sarma movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X