ధనుష్‌తో డేటింగ్? మృణాల్ ఠాకూర్ ఎంత మంది హీరోలతో ఎఫైర్లు నడిపిందంటే?
సినిమాల కంటే ఎఫైర్లు, ప్రేమాయణాలతో వార్తల్లో నిలుస్తున్నారు స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తను సింగిల్ అని చెబుతున్నా మృణాల్‌కు మాత్రం లేనిపోని లింకులు అంటగడుతూ మీడియాలో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ గతంలో సాగించిన ప్రేమాయణాలు, ఎఫైర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
బుల్లితెర నుంచి హీరోయిన్‌గా
బుల్లితెర నుంచి వెండితెరపైకి అడుగుపెట్టి సీతారామం సినిమాతో తెలుగువారిని పలకరించారు మృణాల్ ఠాకూర్. తన అందం, నటనతో వరుస అవకాశాలను దక్కించుకుని స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తున్నారు. గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు ఎంచుకుంటూ సక్సెస్‌లు కొడుతున్నారు. ప్రస్తుతం హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై, తుమ్ హోతో, పూజా మేరి జాన్ సినిమాలలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. తెలుగులో అడివి శేష్ సరసన డెకాయిట్: ఏ లవ్ స్టోరీ, అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

ధనుష్‌తో మృణాల్ డేటింగ్?
ఇక మృణాల్‌పై వచ్చినన్ని గాసిప్స్ మరో హీరోయిన్‌పై రావంటే అతిశయోక్తి కాదు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ సీనియర్ నటుడు సుమంత్‌తో మృణాల్ డేటింగ్ చేస్తున్నారని, త్వరలో ఆయనను పెళ్లాడబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని సుమంత్, మృణాల్ ఖండించారు. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ అగ్రనటుడు ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ధనుష్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ధనుష్ ఇంట్లో మృణాల్ పాగా
అలాగే మృణాల్- ధనుష్‌లు సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ధనుష్ సోదరీలు కార్తీక, విమలను ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఫాలో అవుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే కాదు.. బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే షూటింగ్ ముగిసిన సందర్భంగా ఇచ్చిన పార్టీలో ధనుష్, మృణాల్ కనిపించారు. ఇక సన్ ఆఫ్ సర్ధార్ స్పెషల్ స్క్రీనింగ్‌లో మృణాల్ చేతిని ధనుష్ పట్టుకుని మాట్లాడుతున్న వీడియోలు వీరిద్దరి మధ్య బంధంపై ఊహాగానాలకు తావిస్తున్నాయి.
మృణాల్ బాయ్‌ఫ్రెండ్స్ లిస్ట్ ఇదే
ధనుష్‌తో డేటింగ్ వార్తల నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ గతంలో చాలా మందితో ఎఫైర్లు నడిపారని ఆమె బాయ్‌ఫ్రెండ్స్ పేర్ల సహా బయటపెడుతున్నారు నెటిజన్లు. ఆమె వలకు చిక్కిన వారిలో బుల్లితెర నటులు, ర్యాపర్స్, సూపర్‌స్టార్లు ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు. చిత్ర పరిశ్రమకు రాకముందు నుంచే టీవీ ఇండస్ట్రీలో శరద్ త్రిపాఠితో ప్రేమాయణం సాగించింది మృణాల్.. ఇరు కుటుంబాల్లోనూ వీరి ప్రేమ విషయం తెలిసి పెళ్లి వరకు వెళ్లారు. కానీ అనుకోకుండా ఈ జంట విడిపోయింది. తర్వాత కుంకుమ భాగ్య సీరియల్‌లో తనతో కలిసి నటించిన అర్జిత్ తనేజాతోనూ మృణాల్ డేటింగ్ చేసి అతనికి బ్రేకప్ చెప్పేసింది.
సినిమాలలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన తర్వాత యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ బంధం కూడా ఎక్కువ రోజులు సాగలేదు.. అనంతరం మరో నటుడు బాద్షాతోనూ మృణాల్ ప్రేమాయణం సాగించినట్లుగా బాలీవుడ్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. శిల్పాశెట్టి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మృణాల్- బాద్షాలు జంటగా పాల్గొనడంతో ఈ వార్తకు బలం చేకూరినట్లయ్యింది. ఆపై బాద్షా తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ప్రకటించారు. అలాగే మిస్టర్ ఇండియా ఫేమ్ కుశాల్ టాండన్‌తోనూ మృణాల్ డేటింగ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ధనుష్‌తోనూ మృణాల్ ఠాకూర్ సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా? లేక పుకార్లేనా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











