ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ వివాహం.. పెళ్లి రూమర్స్‌పై హీరోయిన్ క్లారిటీ?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లపై డేటింగ్, పెళ్లి వార్తలు రావడం కొత్తేమీ కాదు. కలిసి సినిమాలు చేయకపోయినా, ఒకే వేదికపై కనిపించినా లేదా ఒకే పార్టీలో పాల్గొన్నా వెంటనే రిలేషన్‌షిప్ కథనాలు తెరపైకి రావడం పరిపాటిగా మారింది. తాజాగా అలాంటి రూమర్లలో చిక్కుకున్న పేర్లే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్,'సీతారామం'తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ వచ్చిన రూమర్స్ పై హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది.
గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ, ఆ రిలేషన్‌షిప్ పెళ్లి వరకు వెళ్లిందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఫిబ్రవరి 14న, అంటే లవర్స్ డే నాడే వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోతున్నారని, అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ వేడుక జరుగుతుందని ప్రచారం జరిగింది. దీనికి ప్రధాన కారణం.. ధనుష్ హాజరైన ఓ బాలీవుడ్ పార్టీలో మృణాల్ కనిపించడమే. దీంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చిందన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి.

ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ టీమ్ స్పందించింది. హీరోయిన్ టీమ్ నుంచి వచ్చిన క్లారిటీతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది. 'వచ్చే నెలలో మృణాల్ పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇవన్నీ పూర్తిగా రూమర్లు మాత్రమే' అని ఆమె పీఆర్ టీమ్ స్పష్టంగా చెప్పింది. అంతేకాదు, ఫిబ్రవరిలో మృణాల్ నటించిన సినిమా రిలీజ్ ఉందని, మార్చిలో మరో ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గుర్తు చేసింది. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఉన్న హీరోయిన్, అకస్మాత్తుగా పెళ్లి చేసుకుంటుందన్న మాటలో ఎలాంటి లాజిక్ లేదని కూడా టీమ్ అభిప్రాయపడింది.
'ప్రస్తుతం మృణాల్‌కు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. పూర్తిగా కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. అనవసరంగా ఎవరో సృష్టించిన ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తప్ప, వాటికి ఆధారాలు లేవు' అంటూ ఆమె టీమ్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరిలో మృణాల్ మ్యారేజ్ అంటూ వచ్చిన వార్తలు కేవలం గాసిప్స్‌గానే మిగిలిపోయాయి.
ఇక ధనుష్ విషయానికి వస్తే.. ఆయనకు దగ్గరగా ఉన్న వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ కథనాలను 'పూర్తిగా ఫేక్, బేస్‌లెస్' అంటూ కొట్టిపారేశాయి. ఇద్దరూ కలిసి ఇప్పటివరకు ఏ సినిమా చేయకపోయినా, సోషల్ మీడియాలో ఒక చిన్న ఊహాగానం ఎలా పెద్ద సంచలనంగా మారుతుందో ఈ రూమర్ మరోసారి చూపించింది.
మొత్తానికి.. ధనుష్-మృణాల్ ఠాకూర్‌ల డేటింగ్, పెళ్లి వార్తలపై హీరోయిన్ టీమ్ ఇచ్చిన స్పష్టతతో నిజం ఏంటో తేలిపోయింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా వస్తున్న ఇలాంటి పుకార్లను నమ్మవద్దని సినీ, మీడియా వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఈ క్లారిటీకి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మృణాల్ పెళ్లి రూమర్లకు తాత్కాలికంగా అయినా ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











