Don't Miss!
- News
వీడియో: `వందే భారత్` రైలు ఎక్కబోతున్నారా- జర భద్రం: ఈ పని అస్సలు చెయ్యొద్దు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
అలాంటి కోరిక ఉంది.. బయట పెట్టేసిన బ్యూటీ
సినీ ఇండస్ట్రీలో మెగా ఫోన్ పట్టుకోవాలని, దర్శకత్వం వహించాలని ప్రతీ ఒక్కరి కోరిక ఉంటుంది. కొంతమంది దర్శకులుగా స్థిరపడి పోదామని వచ్చిన వారు హీరోలయ్యారు.. హీరోలుగా సెటిల్ అవుదామనుకున్నారు డైరెక్టర్స్‌గా రాణించారు. అయితే ఓ అందాల భామకు మెగా ఫోన్ పట్టుకోవాలని ఉందట. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.
ధన్యా బాలకృష్ణకు కావాల్సినంత అందం ఉంది. అయితే అదృష్టం మాత్రం అంతగా లేదనిపిస్తుంది. హీరోయిన్‌లను తలదన్నేలా ఉండే ధన్యకు ఫ్రెండ్, సైడ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. రాక రాక ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం వచ్చింది. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటూ ధన్య పలకరించింది. అయితే అది అంతగా ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను నటనపైనే దృష్టి పెట్టానని తెలిపింది. కానీ భవిష్యత్తులో దర్శకురాలిగా మారాలనే ఆలోచన వుందని చెప్పుకొచ్చింది. లేడీ ఓరియెంటెడ్ కథతోనే తన తొలి సినిమా రూపొందుతుందని పేర్కొంది. దర్శకత్వం చేస్తూనే ఆ సినిమాలో తానే ప్రధాన పాత్రధారిగా చేస్తానని తెలిపింది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. ఇలా ఆ సినిమాలో అన్నిరకాల అంశాలు ఉంటాయని చెప్పుకొచ్చింది.