బికినీలో ఢీ షో జడ్జ్ అందాల ప్రదర్శన.. హద్దు దాటి మరీ రెచ్చగొడుతోందిగా!
సాధారణంగా సినీ రంగంలో సక్సెస్ సాధించాలంటే అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు. దానికి సరిపడా అదృష్టం కూడా ఉండాలి. ఈ కాంబినేషన్ లేకనే చాలా మంది భామలు కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా సాగించడం లేదు. అలాంటి వారిలో ప్రణిత సుభాష్ ఒకరు. ఆరంభంలోనే యమ హైలైట్ అయిన ఈ చిన్నది.. విశేషమైన గుర్తింపుతో పాటు అవకాశాలను కూడా అందుకుంది. కానీ, ఈ మధ్య కాలంలో సినిమాలు పెద్దగా చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రణిత ఓ హాట్ పిక్ వదిలింది. అది మీరే చూడండి!
అలా వచ్చి.. స్టార్లతోనూ:చిన్న వయసులోనే ప్రణిత సుభాష్ 'పోర్కి' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే మూవీతో తెలుగులోకి ఎంటరైంది. అప్పటి నుంచి ఆమెకు ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని స్టార్లతో కలిసి 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లో నటించింది. కానీ, ఇవి అంతగా ఉపయోగపడలేదు.

బాలీవుడ్‌లోనూ రచ్చ:కన్నడ భాషలో స్టార్ హీరోయిన్‌గా.. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ప్రణిత సుభాష్.. సౌత్‌లో మంచి ఇమేజ్‌ను పొందింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టిన ఈ భామ.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాలను చేసింది. తద్వారా తన క్రేజ్‌ను నేషనల్ రేంజ్‌కు పెంచుకుంది. ఇలా చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేసింది.
రీఎంట్రీ ఇస్తోందిగా:వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న సమయంలోనే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది తల్లైంది. ఈ మధ్యే మళ్లీ ఆమె ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్ పరంగా రీఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు ప్రణిత 'రమణ అవతార' అనే కన్నడ మూవీతో పాటు దిలీప్ మలయాళ సినిమాలోనూ నటిస్తోంది.

ఢీ షోతో తెలుగులోకి:తల్లైన తర్వాత చాలా రోజుల పాటు స్క్రీన్‌పై కనిపించని ప్రణిత సుభాష్.. ఇప్పుడు వచ్చిన అవకాశాలను ఒప్పుకుంటూ వెళ్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ చిన్నది ఈటీవీలో ప్రసారం అవుతోన్న 'ఢీ సెలెబ్రిటీ స్పెషల్' అనే షోలో జడ్జ్‌గా చేస్తోంది. ఇందులో తనదైన అందం, జడ్జ్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తద్వారా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.
అందులో ఫుల్ బిజీగా:నటిగా కెరీర్ మొదలు ప్రారంభించినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తోన్న ప్రణిత సుభాష్.. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. అయినా సోషల్ మీడియాలోనూ ఈ భామ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ముందుకెళ్తోంది.

యమ హాట్ షో చేసి:సినిమాల్లో చేస్తున్నప్పుడు ఎంతో డీసెంట్‌గా కనిపించిన ప్రణిత సుభాష్.. సోషల్ మీడియాలో మాత్రం బాగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో డోసు పెంచేసి మరీ అందాల విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా ఈ అమ్మడు అస్సలు తగ్గడం లేదు. ఇలా వరుసగా హాట్ ఫొటోషూట్లు చేస్తూ రచ్చ లేపుతోంది. తద్వారా తెగ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
ప్రణిత ఫొటో వైరల్:ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రణిత సుభాష్ ఓవర్ డోస్ హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు బికినీ వేసుకుని మరీ అందాలను ఓ రేంజ్‌లో ఆరబోసింది. ఫలితంగా ఈ పిక్‌లో ప్రణిత అందాలు పై నుంచి కింద వరకూ తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి.. విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











