Renu desai Review on Dhurandhar 2: ధురంధర్ 2 మూవీపై రేణు దేశాయ్ రివ్యూ

ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2) మూవీ ఇండియాలో సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది. దీని ఊపు చూస్తుంటే 2000 కోట్ల టార్గెట్‌ను అవలీలగా దాటేయడం పెద్ద కష్టం కనిపిస్తోంది. ఈ వీకెండ్ కలెక్షన్స్‌తో కలిపి ధురంధర్ 2 700 కోట్ల మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తద్వారా ఫస్ట్ వీకెండ్‌లో ఈ ఘనత సాధించిన సినిమాగా రికార్డుల్లోకెక్కేందుకు వడివడిగా దూసుకెళ్తోంది ధురంధర్ 2.

ఆదిత్యధర్ టేకింగ్, రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం, కథ, పాటలు, బీజీఎం, నటీనటుల పర్ఫార్మెన్స్, సాంకేతిక వర్గం కృషితో ధురంధర్ 2 సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్, సౌత్.. ఇండియా.. ఓవర్సీస్ అన్న తేడాలు లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు థియేటర్లకు పోటెత్తడంతో ప్రతి ఊరిలో థియేటర్లు చాలారోజుల తర్వాత కళకళలాడుతున్నాయి. చాలా ఏరియాలలో థియేటర్లు చాలక జనం టికెట్ల కోసం ఎగబడుతున్నారంటే పరిస్ధితి అర్దం చేసుకోవచ్చు.

Dhurandhar 2 Review by Renu desai Pawan Kalyan s Ex Wife calls herself proud andhbhakt of PM Narendra Modi

సాధారణంగా హిందీ చిత్రాలు దక్షిణాది అంతగా ఆదరణకు నోచుకోవు. ఎప్పుడో హిట్ టాక్ వచ్చినా సిటీలు, పట్టణాలలోనే ప్రేక్షకులు చూసేవారు. హిందీ భాష రాకపోవడం వల్ల రూరల్ ఏరియాలలో వీటి ఆదరణ అంతంత మాత్రమే. అయితే ధురంధర్ 2 అలాకాదు. పెయిడ్ ప్రీమియర్స్ రోజున తెలుగు, తమిళ వెర్షన్లు అందుబాటులోకి రాకపోయినా సరే హిందీ వెర్షన్‌‌ అయినా సరే ఎగబడి చూశారు. ఇక మార్చి 21 నుంచి తెలుగు, తమిళ వెర్షన్‌ విడుదల కావడంతో ధురంధర్ 2 ఊచకోత కోస్తోంది.

అటు.. ఆదిత్యధర్, రణ్‌వీర్‌తో పాటు ధురంధర్ 2 చిత్ర యూనిట్‌పై సామాన్యులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది సినీ ప్రముఖులు ధురంధర్ 2ను మెచ్చుకుంటూ రివ్యూలు ఇస్తున్నారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి సహా పలువురు సెలబ్రిటీలు తమ విషెస్ తెలియజేస్తున్నారు. ఆశ్చర్యకరంగా దక్షిణాది మొత్తం ఈ సినిమాను నెత్తిన పెట్టుకుంటే.. బాలీవుడ్‌లో మాత్రం నిశ్శబ్ధం కనిపిస్తోంది. ఒకరిద్దరు తప్పించి ధురంధర్ 2పై హిందీ స్టార్స్ మౌనంగా ఉంటున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ ధురంధర్ 2 మూవీని వీక్షించి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేణుదేశాయ్.. తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. సమకాలీన అంశాలపైనా తన అభిప్రాయాలను షేర్ చేస్తూ ఆలోచింపజేస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా ఉన్న ధురంధర్ 2ను రేణు దేశాయ్ వీక్షించారు. ఆదిత్యధర్, రణ్‌వీర్‌పై ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రధాని నరేంద్రమోడీపై తన అభిమానాన్ని చాటుకున్నారు రేణు. నేను బీజేపీకి, ప్రధాని మోడీకి అంధ భక్తురాలిని అని రేణు రాసుకొచ్చారు. దానితోపాటు సినిమాలో దావూద్ ఇబ్రహీం పాత్ర చెప్పే.. ఈ ఛాయ్‌వాలా భారత్‌లోకి వచ్చాక మనవాళ్లలో భయం పెరిగింది అంటూ రేణు దేశాయ్ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X