Don't Miss!
- News
దమ్ముంటే రాజీనామా చెయ్యండి.. టీఆర్ఎస్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈటల రాజేందర్ సవాల్!!
- Lifestyle
Today Rasi Phalalu: ఈ రోజు ఈ రాశుల వారు చేసే చిన్న పొరపాటు వల్ల ఆర్థికంగా నష్టపోతారు...
- Sports
India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
Dia Mirza పెళ్లికి ముందు గర్బం.. వివాహానికి ముందు రొమాన్స్ చేస్తే తప్పేంటి?
బాలీవుడ్ నటి, హైదరాబాదీ దియా మిర్జాకు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించడం కొత్తేమి కాదు. తాజాగా పెళ్లికి శృంగారం, వివాహానికి ముందే గర్బం దాల్చడం లాంటి సున్నితమైన అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనం రేపుతున్నది. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత సంబంధాలపై హాట్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏమిటంటే..

ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లి
గతేడాది
ప్రముఖ
వ్యాపారవేత్త
వైభవ్
రాఖీని
వివాహం
చేసుకోవడం
అందర్నీ
ఆశ్చర్యానికి
గురిచేసింది.
అయితే
పెళ్లి
కాగానే
తాను
గర్బం
దాల్చినట్టు
సోషల్
మీడియా
ద్వారా
వెల్లడించడం
మరింత
ఆశ్చర్యానికి
గురిచేసింది.
అయితే
తాను
పెళ్లి
చేసుకోవడానికి
వివాహానికి
ముందు
ప్రెగ్నెన్సీ
కారణం
కాదు
అని
దియా
మిర్జా
చెప్పింది.

పెళ్లికి ముందు గర్బం వ్యక్తిగత విషయం
దియా మిర్జా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. వివాహానికి ముందు శృంగారంలో పాల్గొనడం, పెళ్లికి ముందే గర్బం దాల్చడమనేది ఒక మహిళకు సంబంధించిన వ్యక్తిగత విషయం. వారి వ్యక్తిగత ఆలోచన విధానం. ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తికి సంబంధించిన విషయం. ప్రెగ్రెన్సీని సెలబ్రేట్ చేసుకోవడమనేది వారి సొంత అభిప్రాయం. అలాంటి ఆలోచన ఉన్నవాళ్లు భయపడకూడదు. బెదిరింపులకు లొంగకూడదు అని దియా మిర్జా తెలిపారు.

మహిళ ఇష్టపడితే తప్పేంటి?
పెళ్లికి ముందు శృంగారం, వివాహానికి ముందే గర్బం దాల్చడమనేది మన సంస్కృతికి విరుద్దం. ప్రజలు ఈ విషయాన్ని ఆమోదించరు. అయితే ఓ మహిళ వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. ఓ మహిళ ఇలాంటి నిర్ణయం తీసుకొంటే పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయంగా చూడాలి. ప్రజలకు సొంత నిర్ణయాలు తీసుకొనే హక్కు ఉంది అని దియా మిర్జా అన్నారు. మన సమాజంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఆదర్శంగా ఉన్నామని అనుకొంటే నేను ఒప్పుకోను అని అన్నారు.

నెలలు నిండకుండానే సంతానం
ఇదిలా ఉండగా, దియా మిర్జా, వైభవ్ దంపతులు మే 2021లో ఆవ్యాన్ అనే అబ్బాయికి జన్మనిచ్చారు. నెలలు నిండకుండా పుట్టడంతో కొద్ది నెలలు చిన్నారిని హాస్పిటల్‌లో ఉంచారు. అబ్బాయి ఎదుగుదల పూర్తయిన తర్వాత ఇంటి తీసుకొచ్చారు. ఇటీవలే చిన్నారి మొదటి జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు.

దియా మిర్జా కెరీర్ ఇలా..
ఇక దియా మిర్జా కెరీర్ విషయానికి వస్తే.. తాప్సీ పొన్నుతో కలిసి ధక్ ధక్ అనే చిత్రంలో నటిస్తున్నది. అలాగే అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నది.ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్సింగ్స్‌కు దియా మిర్జా ప్లాన్ చేసుకొంటున్నట్టు కనిపిస్తున్నది.