రెండో పెళ్లి చేసుకోబొతున్న వైల్డ్ డాగ్ హీరోయిన్.. దియా కాబోయే భర్త ఎవరంటే!
హైదరాబాద్ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా మరోసారి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఓ సారి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొన్న దియా రెండో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిరాడంబరంగా జరుగనున్న పెళ్లి విషయాన్ని బాలీవుడ్ మీడియా బయటపెట్టింది. ఇంతకు దియా మిర్జా ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారంటే..

దియా మిర్జా మొదటి వివాహం గురించి
దియా మిర్జా మొదటి పెళ్లి విషయానికి వస్తే సినీ నిర్మాత, రచయిత సాహిల్ సంగాను వివాహం చేసుకొన్నారు. 2019 ఆగస్టులో వివాహం చేసుకొన్న తర్వాత ఐదేళ్లపాటు దాంపత్య జీవితం సాగింది. ఆ తర్వాత అభిప్రాయ బేధాలు తలెత్తడంతో దియా మిర్జా విడాకులు తీసుకొన్నారు.
పొట్టి దుస్తుల్లో శృతిహాసన్ అందాల ఆరబోత.. గ్లామర్‌తో విజృంభణ

లాక్‌డౌన్‌లో పీకల్లోతు ప్రేమలో
ఆ తర్వాత వైభవ్ రేఖి అనే వ్యాపారవేత్తతో దియా మిర్జా ప్రేమలో పడ్డారు. లాక్‌డౌన్ సమయంలో దియా మిర్జా, వైభవ్ మధ్య బంధం విడిపోలేనంతగా గాఢమైన ప్రేమగా మారడంతో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. తాజాగా వారు పెళ్లి కోసం ఇరు కుటుంబాలను ఒప్పించారు.

వైభవ్‌తో దియా మిర్జా సహజీవనం
కొద్దికాలంగా దియా మిర్జా, వైభవ్ ముంబైలోని పాలి హిల్స్‌లోని తమ నివాసంలో సహ జీవనం చేశారు. లాక్‌డౌన్ కాలంలో వారిద్దరూ క్వాలిటీ సమయాన్ని గడిపారు. అనంతరం తమ బంధాన్ని ఫిబ్రవరి 15వ తేదీన వైవాహిక బంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకొన్నట్టు సన్నిహితులు తెలిపారు

దియా మిర్జా కాబోయే భర్త ఎవరంటే
ఇక దియా మిర్జా పెళ్లి చేసుకోబోయే వైభవ్ కూడా దాంపత్య జీవితం విఫలమైంది. తన మొదటి వివాహం యోగా, ఫిట్‌నెస్ ట్రైనర్ సునైనా రేఖితో జరిగింది. వైభవ్, సునైనాకు ఓ కూతురు కూడా ఉంది.
Recommended Video

నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ మూవీలో
దియా మిర్జా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక హిందీ విషయానికి వస్తే అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తాప్సీతో రూపొందించిన తప్పడ్ చిత్రంలో నటించారు. వ్యక్తిగతంగా యూఎన్‌ఈపీకి గుడ్ విల్ అంబాసిడర్‌గా, పర్యావరణ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











