అతని చేతుల్లో రేప్ సీన్ .. సెట్‌లోనే హీరోయిన్‌కు వాంతులు

మలయాళ నటి విన్సీ, హీరో షైన్ టామ్ చాకోల వ్యవహారం మరోసారి భారతీయ చిత్ర పరిశ్రమలో వేధింపులు, పని ప్రదేశాల్లో పరిస్ధితులపై చర్చకు దారి తీసింది. డ్రగ్స్ తీసుకున్న టామ్ చాకో సెట్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, నా ముందే బట్టలు మార్చుకోవాలని టార్చర్ చేశాడని ఆరోపించింది హీరోయిన్ విన్సీ. ఈ వ్యవహారం మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామంతో మరికొందరు నటీమణులు కూడాద తమకు ఎదురైన ఇబ్బందులను పంచుకుంటున్నారు.

ప్రస్తుతం సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్, లిప్‌లాక్స్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అందరూ ఈ తరహా పాత్రలు చేయడానికి ఇష్టపడరు. కానీ రొమాంటిక్ టచ్ లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు రావడం లేదు. తక్కువతో తక్కువగా లిప్‌లాక్ సీన్ అయినా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో నటీనటులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇంతగా గ్లామర్ షో పెరిగిపోతున్న దశలోనూ కొందరు నటీనటులు తమ హద్దులు దాటడం లేదు. తప్పని పరిస్ధితుల్లో ఇబ్బందిపడ్డ హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి దియా మీర్జా తనకు ఎదురైన ఇబ్బందిని పంచుకున్నారు.

Dia Mirza vomited during the Kaafir shooting Nadaaniyan actress says it was so hard and Shaking Physically

దియా మీర్జా పక్కా హైదరాబాదీ. తొలుత మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ .. మిస్ ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్‌గా అందాల కిరీటాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత సినిమాల నుంచి ఆఫర్లు రావడంతో ఇండస్ట్రిలో అడుగుపెట్టి స్టార్ స్టేటస్ అందుకున్నారు. హిందీకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు. తెలుగులో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన వైల్డ్ డాగ్‌‌లోనూ నటించింది. సినిమాలతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ప్రచారకర్తగానూ వ్యవహరించింది. 2014లో తన వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాని పెళ్లాడింది. కానీ ఐదేళ్లు తిరిగేసరికి వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం పెళ్లైన వైభవ్ రేఖిని పెళ్లి చేసుకున్నారు.

ఇటీవల తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో దియా మీర్జా పేరు వినిపించింది. చెట్ల నరికివేత, మూగ జీవాల పరిస్థితిపై పలువురు ప్రముఖులు స్పందించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లను తొలగించి చదును చేయడాన్ని ఆమె వ్యతిరేకించారు. అభివృద్ధి కోసం జీవ వైవిధ్యాన్ని నాశనం చేయొద్దని దియా మీర్జా కోరారు. ఇకపోతే.. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా 2019లో ఆమె నటించిన కాఫిర్ అనే వెబ్ సిరీస్ సూపర్‌హిట్ అయ్యింది. దీనిని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా దియా మీర్జా మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను వివరించారు. కాఫిర్ సినిమాకు సోనమ్ నాయర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆమె కైనాజ్ అక్తర్ అనే రోల్‌లో దియా నటించారు.. ఈ సిరీస్‌లో ఓ రేప్ సీన్ ఉండటంతో, దీని చిత్రీకరణ సమయంలో శారీరకంగా , మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డట్లు దియా తెలిపింది. రేప్ సీన్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత సెట్‌లోనే వాంతులు చేసుకున్నానని గుర్తుచేసుకుంది. ఇలాంటి పాత్రలు చేయడం ఎంతో సాహసంతో కూడుకున్న పని అన్న దియా.. ఇకపై ఇలాంటి క్యారెక్టర్లు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: dia mirza movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X