ఇలియానా గర్భానికి కారణం అతడేనా?.. బయటపెట్టిన 'పోకిరి' బ్యూటి!
ఇలియానా.. ఈ హీరోయిన్ ను యూత్ అంత ఈజీగా మర్చిపోలేదు. ఎందుకంటే దేవదాసు, పోకిరి సినిమాల్లో ఇలియానా అందానికి తెలుగు రాష్ట్రాల యువత మొత్తం ఫిదా అయిపోయింది. తర్వాత అనేక స్టార్ హీరోలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు చెక్కేసింది.
కొంతకాలానికి సినిమాలకు దూరంగా ఉండి సోషల్ మీడియాలో అదిరే అందాలను ఓపెన్ గా చూపిస్తూ రచ్చ చేసేది. అయితే ఇటీవల పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అని చెప్పి షాక్ ఇచ్చిన ఈ డస్కీ బ్యూటీ తాజాగా అందుకు కారణం అయిన వ్యక్తిని చూపించినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరోలందరితో: 20 ఏళ్ల వయసులోనే 'దేవదాసు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది స్టన్నింగ్ బ్యూటి ఇలియానా. ఫస్ట్ సినిమాలోనే యాక్టింగ్, గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది.. అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షించింది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితోనూ నటించింది.

భారీ హిట్: అలా సెకండ్ సినిమాగా పూరి, మహేశ్ బాబు కాంబినేషన్ లో పోకిరి సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది ఇల్లు బేబి. ఇందులో శృతిగా యావత్ యూత్ ను ఫిదా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టేసింది. ఇలా ఎన్నో హిట్లు కొట్టేసి స్టార్‌డమ్‌ను అందుకుంది ఇలియానా.

తెలుగు-హిందీ సినిమాలు: రాఖీ, కిక్, రెచ్చిపో, ఖతర్నాక్, భలే దొంగలు, ఆట, సలీమ్, నేను నా రాక్షసి, దేవుడు చేసిన మనుషులు, మున్నా, శక్తి, జల్సా, జులాయి, అమర్ అక్బర్ ఆంటోని వంటి తెలుగు చిత్రాలతో తెగ సందడి చేసింది ఇలియానా. తర్వాత బాలీవుడ్ లో కి వెళ్లి స్థిరపడింది. అక్కడ బర్ఫీ, పాటా పోస్టర్ నిక్లా హీరో, మెయిన్ తేరా హీరో, హ్యాపీ ఎండింగ్, పాగల్ పంతీ, రైడ్, రుస్తూం వంటి సినిమాలు చేసింది.

కారణం ఎవరు: ఇలియానా చివరిగా హిందీలో 2021లో బిగ్ బుల్ అనే సినిమాలో అభిషేక్ బచ్చన్ కు జోడీగా నటించింది. దీని తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు ఇల్లూ బేబి. కానీ, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తూ వచ్చేది. అలాగే ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని పెద్ద బాంబ్ పేల్చింది ఈ డస్కీ సుందరి. అందుకు కారణం ఎవరా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు.

ముంబై వ్యాపారి: ఇలియానా.. కత్రీనా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో లవ్ ట్రాక్ నడుపుతుందని, ఆమె ప్రెగ్నెంట్ కావడానికి అతనేనని ఇంతకాలం చర్చ నడిచింది. కానీ, ఇప్పుడు ఇలియానా పోస్టుతో అతను కాదని తెలుస్తోంది. తాజాగా ఇలియానా షేర్ చేసిన పోస్టులో ఓ వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండి 'డేట్ నైట్' అని రాసుకొచ్చింది. అయితే అతను సెబాస్టియన్ కాదు. ఈ ఫొటోలోని వ్యక్తి ముంబైకి చెందిన వ్యాపారి అని టాక్. అతనే ఇలియానా గర్భానికి కారణం అంటూ నెట్టింట్లో టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











