ఆ హీరోయిన్ పై మోజు పడ్డ బాలయ్య.. మరీ పట్టుబట్టి స్పెషల్ గా
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించారు. 1974లో తాతమ్మ కల చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ.. ఈ ఏడాదితో 50 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకోనున్నారు. దీంతో నటసింహాన్ని ఘనంగా సత్కరించేందుకు చిత్ర పరిశ్రమ సిద్ధమైన సంగతి తెలిసిందే.
దశాబ్ధాలుగా తెలుగు తెరకు నాలుగు స్తంభాలుగా ఉన్న నలుగురు హీరోలలో బాలయ్య ఒకరు. తనతో పాటు కెరీర్ ప్రారంభించిన వారు ఎప్పుడో రిటైర్ అవ్వగా ఆయన మాత్రం ఇంకా సత్తా చాటుతూనే ఉన్నారు. నలుగురు అగ్ర హీరోలలో బాలయ్య ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. 60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు నటసింహం. ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలనే టార్గెట్‌తో పనిచేసుకుంటూ పోతున్నారు.

సినిమాలు, షూటింగ్‌లతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ బాలయ్య చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. తన తల్లి బసవతారకం జ్ఞాపకార్ధం తన తండ్రి ఎన్టీఆర్ నెలకొల్పిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా సమాజానికి సేవ చేస్తున్నారు. ఆయన బాధ్యతలు అందుకున్నాక ఆసుపత్రి రూపు రేఖలు మారిపోయాయని, క్యాన్సర్‌కు సంబంధించి అత్యాధునిక వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ బసవతారకం ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని బాలయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇక తండ్రి బాటలోనే రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారు బాలకృష్ణ. నందమూరి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి హిందూపురం నుంచి ఆయన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన బాలయ్య.. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడోసారి హిందూపురంలో విజయం సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్‌బీకే 109 చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటీవల చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఇందులో బాలయ్య లుక్, గెటప్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.
ఇకపోతే.. బాలయ్య పని అయిపోయిందనుకున్న దశలో ఆయన కెరీర్‌కు మంచి బూస్టప్ అందించారు బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంభినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. బాలయ్య పవర్‌ఫుల్ యాక్టింగ్‌కు బోయపాటి మార్క్ టేకింగ్‌తో ఈ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో ఎన్‌బీకే 109 ముగిసిన తర్వాత.. మరోసారి బోయపాటితో బాలయ్య జతకట్టనున్నారు అదే అఖండ - 2. ఫస్ట్ పార్ట్‌లో కనిపించిన దాదాపు అందరు నటులను సీక్వెల్‌లో కంటిన్యూ చేయాలని మేకర్స్ భావించారట.

అయితే హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌కు బదులు మరొకరని తీసుకుందామని బోయపాటి చెప్పగా.. బాలయ్య వద్దు అని కరాఖండీగా చెప్పేశారట. ఆయన సిఫారసుతో అఖండ -2లో మరోసారి ప్రగ్యాకి ఛాన్స్ దక్కింది. దీంతో బాలయ్య పట్టుబట్టి మరి ప్రగ్యాకే అవకాశం ఇప్పించడం వెనుక కారణాలేంటీ అంటూ ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. కానీ అసలే అవకాశాలు రాక, ఫేడవుట్‌కు దగ్గరగా ఉన్న ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌కు అఖండ -2 ఊపిరిలూదుతుందని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











