Deepika Padukone కల్కి కన్నా ముందే దీపికా టాలీవుడ్ ఎంట్రీ.. ఆమె నటించిన తెలుగు సినిమా గురించి మీకు తెలుసా?
విజయం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఖలేజా సినిమాలో రావు రమేష్ ఒక డైలాగ్ అంటదు. అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం ఉండదు అన్నట్లు. ఒక సినిమా హిట్ అయితే తప్ప ఆ స్టార్స్ ఎవరు అనేది ప్రేక్షకులకు గుర్తు ఉండదు. ఇప్పుడు దీపికా పదుకొనే పరిస్థితి అలానే ఉంది. ఈ చిన్నది బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినా కానీ, టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా మారాక తెలుగులో కల్కి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అని అనుకుంటే పొరపాటే.. దీపికా తొలితెలుగు సినిమా కల్కి కాదు.. ఏంటి.. షాక్ అయ్యారా.. ? అవును నిజమే.. కల్కి కన్నా ముందే దీపికా ఒక తెలుగు సినిమాలో నటించింది. అదేంటో తెలుసుకుందాం రండి.
ఇండస్ట్రీలో ఒక భాషలో పేరుతెచ్చుకొని ఇంకో భాష కు వలస వెళ్లే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అది వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది కూడా. అలా బాలీవుడ్ నుంచి తెలుగుకు వచ్చి స్థిరపడినవాళ్లు చాలామందే ఉన్నారు. టాలీవుడ్ లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చి, చేతులు కాల్చుకొని వెనక్కి వెళ్ళిపోయినవారు ఉన్నారు. ఇక కొంతమంది మాత్రం.. కేవలం సాంగ్స్ లో మెరిసి , తమకంటూ ఒక చిన్న గుర్తింపును తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. అందులో మలైకా అరోరా, మనోహరి బ్యూటీ నోరా ఫతేహి లాంటివారు.. ఒక సాంగ్ లో మెరిసి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి వెళ్లారు.

ఇకపోతే దీపికా పదుకొనే సైతం ఒక తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సినిమానే లవ్ ఫర్ ఎవర్. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణదీప్, మృదుల అనే కొత్త జంట నటించారు. 2019 లో వచ్చిన ఈ సినిమా.. అసలు రిలీజ్ అయ్యిందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఈ సినిమాలో దీపికా ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. జయంత్ సి పరాన్జీ బాలీవుడ్ దర్శకుడు అన్న విషయం తెల్సిందే. దీంతో ఆయన మాట కాదనలేక దీపికా ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించినట్లు తెలుస్తోంది. అప్పటికీ దీపికా ఎవరు అనేది తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవడంతో.. ఆ సాంగ్ కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ఈ సినిమా తరువాత దీపికా తెలుగు వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఇక కట్ చేస్తే 5 ఏళ్లలో ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఇక ఆమెకు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న కల్కి2898 ఏడీ సినిమాలో హీరోయిన్ గా దీపికా నటిస్తుంది అని తెలియడంతో సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇంతపెద్ద సినిమాలో దీపికా ఎలాంటి పాత్రను చేస్తుందో అని అందరూ ముందు కంగారు పడ్డారు. కానీ, సినిమా చూసాకా సుమతి పాత్రలో దీపికా కన్నా ఇంకెవరు బాగా చేయలేరు అని చెప్పుకొస్తున్నారు. భగవంతుడినే కడుపున మోసే తల్లిగా.. తన బిడ్డను కాపాడుకోవడానికి ఆమె పడే బాధ.. సుమతి పాత్రలో దీపికా నటించింది అందం కన్నా జీవించింది అని చెప్పాలి. కల్కి విజయంలో దీపికా తనవంతు కృషి చేసింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇక 2019 లో స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చినా దీపికాను పట్టించుకోని ప్రేక్షకులు.. కల్కి హిట్ అవ్వడంతో అమ్మడిని అమాంతం ఎత్తేస్తున్నారు. అసలు దీపికా.. ఇలాంటి ఒక సాంగ్ లో నటించింది అన్న విషయమే ఎవరికి తెలియనప్పుడు.. ఆమెను ఎలా ప్రశంసిస్తారు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు . కల్కి హిట్ అవ్వడంతో దీపికా మొదటి టాలీవుడ్ సాంగ్ కోసం అభిమానులు సెర్చ్ చేయడం మొదలువుపెట్టారు. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే ఈ చిన్నది.. మొదటి సినిమాతోనే తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ విజయాంతో ఇక్కడే సెటిల్ అవుతుందా? కల్కి వరకే పరిమితమవుతుందా ? అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











