కల్కి మూవీలో దీపిక పదుకోన్ పాత్రకు తెలుగులో డబ్బింగ్.. చెప్పిన ఆ హాట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

By Lekhaka

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ రిలీజై దాదాపు వారం రోజులు పూర్తి కావస్తోంది. కానీ ఇంకా ఆ మేనియా తగ్గలేదు. ఇక ఈ సినిమా గురించి బయటకు వస్తున్న రోజుకో వార్త కల్కిపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం కల్కిలో దీపికా పదుకొనే పోషించిన సుమతీ పాత్రకు మరో స్టార్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పిందట. మరి ఆ హీరోయిన్ ఎవరో ఒక లుక్కేద్దాం పదండి.

ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియాస్ కాస్ట్లీ మూవీ కల్కి 2898 ఏడి బాక్స్ ఆఫీస్ ను దున్నేస్తోంది. కలెక్షన్ల పరంగా ఈ మూవీ సృష్టిస్తున్న సునామీ స్పీడ్ ఇంకా తగ్గలేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు కొల్లగొట్టిన కల్కి మూవీ ఇంకా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తోంది.

Did you know this heroine Shobhita Dulipala dubbed for Deepika Padukone in the Telugu version of Kalki 2898 AD

జూన్ 27న కల్కి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అయింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు భారీ ఎత్తున థియేటర్లలో సందడి చేసింది. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో అత్యధిక వసూళ్లు రాబడుతోంది. కల్కి మూవీలో ప్రభాస్ తో పాటే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే సహా పలువురు స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి చాలామంది తారలు ఈ సినిమాలో అతిథి పాత్రల్లో మెరిశారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ చేసిన పోస్ట్ ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. కల్కి థియేటర్లలో ఈ బ్యూటీకి చిత్ర బృందం స్పెషల్ గా క్రెడిట్ ఇవ్వడంతో అసలు ఆమె పేరు ఎందుకు తెరపైకి వచ్చింది అనే ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. అయితే నిజానికి ఈ బ్యూటీ కల్కి సినిమాలో నటించలేదు. కానీ సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొనేకు తెలుగులో డబ్బింగ్ చెప్పిందట.

Did you know this heroine Shobhita Dulipala dubbed for Deepika Padukone in the Telugu version of Kalki 2898 AD

దీపికా పదుకొణె ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టింది. ఒరిజినల్ కంటే ముందు దీపిక కల్కి సినిమాకు తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంది. ట్రైలర్‌లోనూ కూడా ఆమె గొంతు వినిపించింది. కానీ దీపికా డబ్బింగ్‌పై దారుణంగా నెగెటివిటీ రావడంతో, ఆమె పాత్రకు శోభిత డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా శోభిత మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సుమతి పాత్రకు డబ్బింగ్ చెప్పినందుకు థాంక్స్ చెబుతూ థియేటర్లలో శోభితకు క్రెడిట్స్ ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్ ని శోభిత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ స్వీటెస్ట్ అని రాసుకొచ్చింది శోభిత. దీంతో ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఆ ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. కాగా శోభిత మాతృభాష తెలుగు అనే విషయం అందరికి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X