నిన్ను చూస్తే గుండే ఆగినంతగా.. భాష రాదు కానీ చచ్చేంత ఇష్టం.. రష్మికకు అభిమాని ప్రేమలేఖ
సినీ తారలపై అభిమానులు మోజు పడటం సర్వసాధారణమే. తమకు నచ్చిన హీరోయిన్లకు తమ మనసులో మాటను చెప్పుకొంటూ లేఖలు సంధించడం నిత్యం జరుగుతూనే ఉంటుంది. అలాంటి సంఘటనే హీరోయిన్ రష్మిక మందన్నకు ఎదురైంది. ఓ అభిమాని తన గుండెలో నింపుకొన్న ప్రేమను లేఖ రూపంలో బయటపెట్టాడు. ఆ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేయగా దానికి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తున్నది. ఆ లేఖలో అభిమాని ఏం రాశాడంటే..

భూమ్మీద మిమ్మల్ని ఇష్టపడినంతగా
ఈ భూమ్మిద మిమ్మల్ని నేను ఇష్టపడినంతగా మరొకరు ఇష్టపడరు. నా హృదయంలో మీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. మీరు నవ్వే విధానం, కనిపించే తీరు, నీ అభిమానులను మీరు గౌరవించే తీరు నన్ను బాగా ఆకట్టుకొన్నది. అదే మిమ్మల్ని ఇష్టపడేలా చేసింది అని అభిమాని లేఖలో పేర్కొన్నారు. మీరు సాయం సంధ్య కంటే ఎక్కువగా అందంగా ఉంటారు. బంగారం కంటే విలువైన దానివి. క్యాండీ (తీపి పదార్థం) కంటే మరింత స్వీట్‌గా ఉంటావు. చంద్రుడి కంటే చల్లగా ఉంటావు అని ప్రశంసలతో ముంచెత్తాడు.

గుండె కొట్టుకోవడం ఆగిపోయింది
నాకు బాగా గుర్తుంది.. తొలిసారి తెర మీద నీ ఎక్స్‌ప్రెషన్ చూసినప్పుడు నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అది నాజీవితం గొప్ప ఫీలింగ్. నాకు కన్నడ, తెలుగు భాషలు తెలియవు. కానీ నీ సినిమాలు చూస్తుంటాను. నీవంటే చచ్చేంత అభిమానిగా మారాను. ప్రేమకు భాష అవసరం, అడ్డంకి కాదు అని మరోసారి రుజువైంది అని అభిమాని తన లేఖలో పేర్కొన్నాడు
చదువుపై దృష్టిపెట్టలేక పోతున్నా
ప్రతీ రోజు నీ గురించి ఆలోచించకుండా ఉండటం చాలా కష్టంగా మారుతున్నది. నీ కారణంగా నా చదువుపై పూర్తిగా దృష్టిపెట్టలేకపోతున్నాను. నీకు ఎన్నో విషయాలు చెప్పాలని ఉబలాటపడుతున్నాను. నా జీవితమనే పాటకు నీవు గొంతుకవు అయ్యావు. నీవంటే నాకు చాలా చాలా స్పెషల్ అని చెప్పాలనుకొంటున్నాను అని తన లేఖలో రష్మిక గురించి అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ బ్రేకప్
తెలుగు, కన్నడ భాషల్లో విశేషంగా రాణిస్తున్న రష్మిక మందన్న తన వివాహా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకొన్నారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలో హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి.. ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వారిద్దరు వివాహ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం జరిగిన సంగతి తెలిసిందే.

వరుస సినిమాలతో బిజీగా
ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో రష్మిక బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్, నితిన్‌తో భీష్మ చిత్రంలో, సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రానున్న సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో ఆమె నటించిన ఛలో, గీత గోవిందం, దేవదాస్ చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











