twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నో ఆశలు పెట్టుకొని రొమాన్స్ చేసిన హీరోయిన్.. చివరకు మిగుల్చుకుంది ఇదే!

    |

    సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఈ రంగంలో అడుగు పెట్టిన ప్రతీ ఒక్క హీరోయిన్ అందాల ఆరబోతలో, రొమాంటిక్ సన్నివేశాల్లో పాలు పంచుకోక తప్పదు. ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోయిన్లకు ఇది మరీ ఎక్కువైంది. రొమాంటిక్ నేపథ్యంలోనే ఎక్కువ సినిమాలు వస్తుండటంతో అందులో హీరోయిన్ అందాలు, హీరోతో ఆమె చేసే రొమాన్స్ మాత్రమే బాగా హైలైట్ అవుతోంది. కాబట్టి హీరోయిన్స్ ఏ మాత్రం వెనకాడినా నెట్టుకు రాలేని పరిస్థితి. ఈ కోవలోనే యంగ్ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ అన్నింటికీ సిద్ధమై 'హిప్పీ'లో కార్తికేయతో రొమాన్స్ పండించింది. కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఆమెకు మిగిలిందేంటి? వివరాల్లోకి పోతే..

    ప్రతీ కొత్త హీరోయిన్‌కీ అదే ఆశ

    ప్రతీ కొత్త హీరోయిన్‌కీ అదే ఆశ

    సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రతీ కొత్త హీరోయిన్ ఆశ ఒక్కటే. తాను ఎలాగైనా స్టార్ హీరోయిన్ కావాలని, తనకో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలనే ఆరాటమే ఎక్కువ. అందుకే తన మొదటి సినిమాతోనే తమ టాలెంట్ బయటపెడితే ఇక తిరుగుండదు అని భావిస్తుంటారు. అందరిలాగే అచ్చం అలాగే అనుకొని 'హిప్పీ' లో ఎక్కడా వెనకాడకుండా రొమాంటిక్ సీన్స్ చేసేసింది దిగంగన సూర్యవంశీ.

    హిప్పీ విడుదలకు ముందు దిగంగన సూర్యవంశీనే హైలైట్

    హిప్పీ విడుదలకు ముందు దిగంగన సూర్యవంశీనే హైలైట్

    హిప్పీ సినిమా విడుదలకు ముందు ఇతర హీరోయిన్స్ కంటే దిగంగన సూర్యవంశీనే బాగా హైలైట్ చేశారు. సినిమా ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ లలో ఆమె చేసిన రొమాంటిక్ సీన్స్ చూపించి సినిమాకు హైప్ తీసుకొచ్చారు. పైగా దిగంగనలో ఫుల్ గ్లామర్ ఉండటంతో హిప్పీ హిట్ అయ్యిందంటే ఇక ఆమెకు వరుస అవకాశాలే అని భావించారంతా.

    కానీ సీన్ రివర్స్ అయింది

    కానీ సీన్ రివర్స్ అయింది

    అయితే ఎంత అందాలు ఆరబోసినా, ఎన్ని రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించినా అదృష్టం కూడా కలసివస్తేనే గుర్తింపు వస్తుంది. ఆ సినిమా హిట్ అయితేనేగా అందులోని హీరోయిన్, ఆమె టాలెంట్ ఏంటో అందరికీ తెలిసేది. అదే దిగంగన సూర్యవంశీకి దెబ్బేసిందనే టాక్ నడుస్తోంది. హిప్పీ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో దిగంగన సూర్యవంశీకి నిరాశే ఎదురైందనేది లేటెస్ట్ టాక్.

    మొదటి సినిమాతోనే ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర

    మొదటి సినిమాతోనే ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర

    హిప్పీ సినిమాలో కార్తికేయకి జోడిగా నటించిన దిగంగన సూర్యవంశీ నటన పరంగా భేష్ అనిపించుకుంది. నేటితరం హీరోయిన్ లో ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ అమ్మడితో ఉన్నాయి కూడా. కానీ ఊహించిన మేర హిప్పీ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడం దిగంగన సూర్యవంశీకి కలసి రాణి అంశం. మొదటి సినిమాతోనే ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడటం సహజం కాబట్టి ఆమె కెరీర్‌ కాస్త కష్టమే అని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

    హిప్పీ మూవీ..

    హిప్పీ మూవీ..

    టీఎన్ క్రిష్ణ దర్శకత్వంలో హిప్పీ సినిమా తెరకెక్కింది. కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించగా.. నివాస్ కె ప్రసన్న సంగీతం సమకూర్చారు. కళైపులి ఎస్.థాను ఈ చిత్రానికి నిర్మాత. జూన్ 6న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

    English summary
    Hero Karthikeya latest movie Hippi. Heroine Digangana Suryavanshi romance hilight in this movie. After release this movie gets negetive talk from the audians
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X