‘ఆ హీరోను కలవడానికి నా భర్తతో గొడవ’.. దిల్ రాజ్ భార్య ఓపెన్ కామెంట్స్

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా దిల్ రాజ్ ఎదిగిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇక దిల్ రాజ్ నిర్మించే చిత్రాలపైనా ఫిల్మ్ సర్కిల్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకుంటుంది. చివరిగా దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలను రిలీజ్ చేశారు. ఇక నెక్ట్స్ నితిన్ తో సినిమాను తీసుకురాబోతున్నారు.

ఇదిలా ఉంటే.. దిల్ రాజ్ వ్యక్తి గత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. తను డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా ఎలా మారారో.. అందుకు ఎంత కృషి చేశారన్నది పలు సందర్భాల్లో వివరిస్తూనే వస్తున్నారు. ఇక దిల్ రాజ్ వైగ్యా రెడ్డిని రెండో వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. తన మొదటి భార్య అనితా రెడ్డి 2017లో మరణించడంతో ఆ తర్వాత మూడేళ్లకు వైగ్యా రెడ్డిని 2020లో పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందే కూతురు హర్షితా రెడ్డికి దిల్ రాజ్ తండ్రి కాగా, 2022లో కొడుకుకు జన్మినిచ్చారు. ఇక వైగ్యా రెడ్డి తన పెళ్లి తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తేజస్విని అని పేరు మార్చుకుంది.

Dil Raju Wife Tejaswini fight with his Husband for meet Pawan Kalyan

ఇక తాజాగా దిల్ రాజ్ భార్య తేజస్విని ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ కు తను చిప్పటి నుంచి వీరాభిమానని చెప్పింది. ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూసే దానిని చెప్పుకొచ్చింది. అలాంది తమ ప్రొడక్షన్ కంపెనీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ నటిస్తుంచడం చాలా గొప్పగా అనిపించిందని చెప్పింది. దిల్ రాజ్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ చిత్రం రూపుదిద్దుకోవడం మరిచిపోలేమన్నారు.

అయితే వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ సమయంలో తన భర్త దిల్ రాజుతో గొడవ పడేదని చెప్పింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పింది. ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ ను కలవాలని అనుకున్నానని, మొత్తానికి వకీల్ సాబ్ షూటింగ్ సమయంలో ఫ్యాన్ గర్ల్ మూమెంట్ వచ్చిందని చెప్పింది. కానీ దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ దగ్గర పర్మిషన్ తీసుకునేందుకు సంకోచించే వారని, అయినా పట్టుబట్టి పవన్ కళ్యాణ్ దగ్గర టైమ్ తీసుకున్నామని వివరించింది. ఇక పవన్ కళ్యాణ్ ఎంతో మర్యాదగా మాట్లాడారని, మహిళల గురించి గొప్పగా చెప్పారని చెప్పింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు దిల్ రాజ్ ను ఇబ్బంది పెట్టినట్టు చెప్పుకొచ్చింది.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓజీ, హరి హర వీరమల్లు చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ కాంబినేషన్ లోని ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానూ ప్రజలకు సేవ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X