తప్పుగా ఫొటోలు తీస్తున్నారు.. ఆ విషయంలో ‘దిల్ రూబా’ హీరోయిన్ ఫైర్!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. రొటీన్ కి భిన్నంగా చిత్రాలను చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరోయిన్ లకు కూడా తన చిత్రాల్లో అవకాశాలను అందిస్తున్నారు. చివరిగా ' క' చిత్రంతో బ్లాక్ బస్టర్ సినిమాను సొంతం చేసుకున్నారు. ప్రేక్షకులను అలరించడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

కిరణ్ అబ్బవరం, యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన చిత్రం ' దిల్ రూబా'. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. మార్చి 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం తో పాటు, హీరోయిన్ రుక్సార్ దిల్లాన్ కూడా దిల్ రుబా చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమంలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. ఈ క్రమంలో రుక్సార్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆ విషయంపై తాజాగా స్పందించింది కూడాను.

Dilruba Heroine Serious for Taking Uncomfortable PHotos Here is her Reaction on it

రుక్సార్ దిల్లాన్ దిల్ రుబా మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్న సందర్భంగా తాను అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయినా మూమెంట్స్ ను కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అప్పటికే తను వేసుకున్న దుస్తులతో ఇబ్బంది పడుతుండగా అర్థం చేసుకోవాల్సింది పోయి ఫోటోలు కూడా తీసి వైరల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రుక్సార్ ధిల్లాన్ అలా ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లపై మండిపడింది.

మీలో ఎవరైనా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటే సెల్ఫీలు ఇస్తారా? ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన ఊరుకుంటారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఇలాంటి పనుల వల్ల రుక్సార్ చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని వేదిక పైన చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుతం మాట్లాడిన మాటలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఏదేమైనా ఓవైపు కిరణ్ అబ్బవరం తన సినిమాలను స్ట్రాటజీతో ప్రచారం చేసుకుంటుంటే.... ఇలా రుక్సార్ విషయంలోనూ తప్పుగా ఫోటోలు తీశారు అంటూ వచ్చిన వార్తలతో సినిమాకు మరింత ప్రచారం జరిగింది.

ఇక రుక్సార్ 2016 నుంచి హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. మొదట 'రన్ ఆంటోనీ' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. తెలుగులోకి 'ఆకతాయి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాని సరసన ' కృష్ణార్జున యుద్ధం' చిత్రంలో నటించి మంచి స్పందనను పొందింది. అలాగే యంగ్ హీరో విశ్వక్సేన్ సరసన 'అశోక వనం'లో అర్జున కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరయింది. ప్రస్తుతం 'దిల్ రుబా'తో ఈ బ్యూటీ ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నజియా డేవిసన్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది.

More from Filmibeat

Read more about: rukshar dhillon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X