Dimple Hayathi ట్రాఫిక్ డీసీపీలపై విరుచుకుపడ్డ డింపుల్ హయతి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కెలికిన తెలుగు హీరోయిన్!
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి మరోసారి ట్రాఫిక్ పోలీసులను కెలికే ప్రయత్నం చేసింది. గత కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్ డీసీపీతో పార్కింగ్ వివాదంలో వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ట్రాఫిక్ డీసీపీతో పార్కింగ్ విషయంలో గొడవపడి పరస్పరం కేసులు నమోదు చేసుకొన్న విషయం మరువక ముందే మరోసారి ట్రాఫిక్ పోలీసులను టార్గెట్ చేస్తూ డింపుల్ హయతి ట్వీట్ చేసింది. డింపుల్ హయతి చేసిన ట్వీట్.. ఆమె వివాదం గురించిన వివరాల్లోకి వెళితే..
జూబ్లీ హిల్స్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న హీరోయిన్ డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య పార్కింగ్ వివాదం అనేక మలుపులు తిరిగింది. తన విధులకు ఆటంకం కలిగిస్తుందనే ఆరోపణలపై డింపుల్ హయతిపై తెలంగాణ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కేసు నమోదు చేయడం వివాదంగా మారింది.

అయితే తెలంగాణ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కేసు నమోదు చేసిన కేసుపై డింపుల్ హయతి అభ్యంతరం వ్యక్తం చేసింది. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ డీసీపీ రాహుల్‌పై ఆమె కూడా కేసు నమోదు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. అయితే తనను పోలీస్ స్టేషన్‌కు పిలిచి మూడు గంటలపాటు అక్కడే ఉంచారంటూ ఆరోపణలు చేసింది. తన లాయర్‌తో కలిసి మీడియాతో మాట్లాడి విమర్శలు చేసింది.
అయితే పార్కింగ్ వ్యవహారంలో హీరోయిన్ డింపుల్ హయతి, ఆమె లాయర్ డేవిడ్ విక్టర్‌ను హైకోర్టు మందలించింది. పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలపై ఇద్దరిని పోలీసు విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశాల్లో పేర్కొన్నది. వారిద్దరికి CPRC 41A సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా, బుధవారం డింపుల్ హయతి ట్రాఫిక్ పోలీసులపై ఫిర్యాదు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇంటికి వెళ్లాలంటే ట్రాఫిక్ వల్ల నరకంగా మారింది. ఇంటికి చేరాలంటే కనీసం గంటకుపైనే పడుతున్నది. ట్రాఫిక్ డీసీపీలు ఏం చేస్తున్నారు? ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే పరిస్థితి ఏమిటి? హైదరాబాద్‌లో కాలు తీసి బయటకు పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తున్నది. డియర్ గవర్నమెంట్.. పెట్రోల్ మాకు ఫ్రీ రావడం లేదు అంటూ డింపుల్ హయతి ఘాటుగా ట్విట్టర్‌లో స్పందించింది.
డింపుల్ హయతి చేసిన తాజా ట్వీట్ మరో వివాదానికి దారి తీసేలా ఉంది. ట్రాఫిక్ డీసీపీల పనితీరును, తెలంగాణ ప్రభుత్వ పరిపాలనను ప్రశ్నించే విధంగా ఉండటం చర్చనీయాంశమవుతున్నది. కేటీఆర్‌ను, తెలంగాణ సీఎంను ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. డింపుల్ హయతి చేసిన తీరుపై ట్రాఫిక్ డీసీపీలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కేటీఆర్ గానీ, ట్రాఫిక్ విభాగం ఎలా స్పందిస్తారనే విషయం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











