‘ఆ తప్పు వ్యవస్థదే.. హీరోయిన్లను టార్గెట్ చేయొద్దు’

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారని వారి నటనను కూడా మెచ్చుకుంటున్నారు. అయితే హీరోయిన్ జాన్వీ కపూర్ విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాత్రను చూపించిన విధానం, రొమాంటిక్ సన్నివేశాలపై క్రిటిక్స్, సినీ ప్రముఖులు మండిపడుతున్నారు.

జాన్వీ కపూర్‌ పాత్రకు అన్యాయం చేశారని.. గ్లామర్ షోకి మాత్రమే ఆమెను ఉపయోగించుకున్నారని మండిపడుతున్నారు. స్వయంగా తన పాత్రపై వచ్చిన రివ్యూని లైక్ చేసి జాన్వీ కపూర్ కూడా వివాదానికి ఆజ్యం పోశారు. తన అసంతృప్తిని, ఆవేదనను జాన్వీ ఇలా వెళ్లగక్కారని నెటిజన్లు అంటున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవమని, వారిని అసభ్యంగా చూపించడం తన ఉద్దేశం కాదని ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని పోస్ట్ చేశారు.

Dimple Hayathi on janhvi kapoor s peddi controversy dont blame actress question the writers and filmmakers

ఇదే సమయంలో పలువురు హీరోయిన్లు కూడా జాన్వీకి మద్ధతు పలుకుతున్నారు. కన్నడ నటి ఆషికా రంగనాథ్ తనదైన శైలిలో స్పందించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. కేవలం క్రేజ్, భారీ పారితోషికం కోసమే హీరోయిన్లు నటిస్తున్నారన్న వాదనను ఆమె తప్పుబట్టారు. హీరోయిన్లను నిందించడం అందరికీ ఫ్యాషన్‌గా మారిపోయిందని, ఆ ధోరణిని మొదట మార్చుకోవాలి. థియేటర్లలో ఇప్పటికీ ఇలాంటి గ్లామర్ పాత్రలే అమ్ముడవుతాయని నమ్ముతున్న వ్యవస్థను, మేకర్స్‌ను నిందించాలని ఆషికా ఫైర్ అయ్యారు.

పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనప్పుడు సహజంగానే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం లభిస్తుందని, అలాంటప్పుడు ఆయా చిత్రాలను ఎంచుకోవడంలో తప్పు లేదు. వెండితెరపై ఓ హీరోయిన్ పాత్ర బాలేదన్నా.. సరిగా రాయలేదన్నా ఆ బాధ్యత పూర్తిగా కథలు రాసే రచయితలు, దర్శకులదే తప్పు. స్క్రిప్ట్‌ను అనుసరించి నటించే హీరోయిన్లను నిందించడం సరికాదని ఆషికా రంగనాథ్ తేల్చిచెప్పారు. తాజాగా మరో హీరోయిన్ డింపుల్ హయాతి కూడా జాన్వీ కపూర్ వివాదంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.

నటీనటుల పాత్రలపై చర్చ జరగడం సంతోషం. కానీ ఈ అంశంలో హీరోయిన్లను తప్పుబట్టకుండా ఇలాంటివే అమ్ముడుపోతాయని భావించే మేకర్స్‌ని, సినీ వ్యవస్థని నిందించాలి. నటీనటులు తమకు లభించే అవకాశాల పరిధిలోనే పనిచేస్తూ.. పెద్ద ప్రాజెక్ట్‌లలో నటిస్తూ మరింత మందికి చేరువ కావాలని ఆశపడుతాం. ఏదైనా పాత్ర సరిగా కనిపించకపోతే దాని బాధ్యత.. ఆ పాత్ర పోషించిన నటిది కాదు. అది పూర్తిగా దర్శక రచయితలదే. కానీ దురదృష్టవశాత్తూ మేము చేసే పాత్రల కారణంగా ఒక ఇమేజ్ ముద్ర పడిపోతుంది. దీని కారణంగా పూర్తి నటనా సామర్ధ్యాన్ని నిరూపించుకునే అవకాశం దక్కడం లేదు. హీరోలకు కావాల్సినంత స్వేచ్ఛ, ప్రాధాన్యత లభిస్తాయి. సినిమాల నిర్మాణంలో నిర్ణయాలు కేవలం ఒకరి మీద ఆధారపడి ఉండవు. మేమంతా మెరుగైన సినిమాలలో భాగంగా కావడానికి అర్హులమని డింపుల్ హయాతి పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X