అన్ని నిజాలు బయటికొస్తాయి... వేణుస్వామి పూజలపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటి జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. నటీనటులు ఇతర ప్రముఖుల జాతకాలు చెప్పడంతో పాటు వారి కోసం ప్రత్యేకంగా తారా, బగళాముఖి వంటి శక్తివంతమైన పూజలు చేస్తూ ఫేమస్ అయ్యారు. ఆయన పూజలు చేసిన పలువురు స్టార్ స్టేటస్ అందుకోవడం, కొన్ని జ్యోస్యాలు నిజం కావడంతో వేణుస్వామికి ఇంటికి సామాన్యులు, ప్రముఖులు క్యూకడుతున్నారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం నటి ప్రగతి టర్కీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో పతకాలు సాధించారు. 50 ఏళ్ల వయసులో ఆమె సాధించిన విజయానికి గాను సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత ప్రగతి తన దగ్గర పూజలు చేయించుకున్న ఫోటోలు, వీడియోలను వేణుస్వామి విడుదల చేయడం సంచలనం సృష్టించింది. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో ప్రగతి స్పందించారు. తన కష్టం, క్రమశిక్షణతో పతకాలు సాధించానని... దీనికి ఏ పూజలు కారణం కాదని పేర్కొన్నారు. తర్వాత వేణుస్వామి కూడా ప్రగతి దేవుడి ఆశీస్సులతో విజయం సాధించారని, ఇందులో తన ప్రమేయం ఏం లేదని క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్ డింపుల్ హయాతి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

విజయవాడకు చెందిన డింపుల్ హయాతి... గల్ఫ్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టారు. అయితే గద్ధల కొండ గణేష్ మూవీలో స్పెషల్ సాంగ్‌తో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత డింపుల్ చేసిన యూరేకా, ఖిలాడీ, రామబాణం తదితర సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు పోలీస్ ఆఫీసర్‌తో వివాదం ఆమెకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ కష్టకాలం నుంచి బయటపడేందుకు వేణుస్వామి దగ్గర డింపుల్ హయాతి పూజలు చేయించుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పూజల్లో వైన్ బాటిల్ పెట్టడం అప్పట్లో దుమారం రేపగా.. దానికి వేణుస్వామి క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో ఆషికా రంగనాథ్‌తో పాటు డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామితో పూజలపై డింపుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్, దుష్ప్రచారంపై ఎలా స్పందిస్తారని యాంకర్ ప్రశ్నించగా.. నేను అందరిలాగానే మనిషిని. మొదట్లో నాకు అర్ధం కాలేదు. చాలా విమర్శలు వచ్చాయి, ట్రోలింగ్ జరిగింది. అందరి కంటే నాకు చాలా తొందరగా వచ్చాయి. కానీ అవన్నీ నన్ను మరింత రాటుదేల్చాయి. నా పక్కన ఉన్న జనానికి నేనెంటో తెలుసు.. ఇప్పుడున్న సోషల్ మీడియా వల్ల మనం ఏం మాట్లాడినా వైరల్ అయిపోతుంది. ఒక చిన్న నెగిటివ్ వస్తే ఇక దాని మీదే కూర్చొని, కామెంట్స్ చేస్తుంటారు. ఫేక్ న్యూస్‌కి అనవసరంగా వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ట్వీట్స్ చేశాను, ఇండైరెక్ట్‌గా చెప్పాను... అయితే ప్రజల ఆలోచన కూడా మారింది. ప్రతి దానికి ఒక టైం వస్తుంది.. అన్ని నిజాలు అప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తాయని డింపుల్ తేల్చిచెప్పారు.
మీ పేరు వాడుకుని కొంతమంది ఫేమస్ అయిపోతున్నారు.. డింపుల్ హయాతితో నేను ఆ పూజలు చేయించాను, ఈ పూజలు చేయించాను అందుకే స్టార్ హీరోయిన్ అయిపోయింది అంటున్నారు.. నిజంగా జరిగాయా? అని యాంకర్ ప్రశ్నించగా... అలాంటిదేమీ లేదు, గుడికి ఫ్యామిలీతో వెళ్తాను. ఈ పూజలు చేస్తే అలా అయిపోతుంది, ఆ పూజలు చేస్తే ఇలా అయిపోతుంది అని నమ్మను. ఫ్యామిలీస్, కొన్నిసార్లు పెద్దవాళ్లు చెప్పింది చేస్తాం, పెద్దవాళ్లు చెప్పినట్లు వినాల్సి వస్తుంది అంతకుమించి ఏం లేదు. ఎవరో చెబితే, ఎవరో స్టార్ అయిపోరు, ఎవరో చూపిస్తే వాళ్లు కారు. దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని నేను నమ్మను. నా కుక్కపిల్లలు కూడా నాకు దేవుళ్లతో సమానం అని డింపుల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. డింపుల్ హయాతి వ్యాఖ్యలపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











