డింపుల్ హయతి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా? దాసరి, నటి ప్రభతో రిలేషన్ ఏమిటంటే?

నటిగా నిలదొక్కుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నారు డింపుల్ హయతి. విజయవాడకు చెందిన ఈ ముద్దుగుమ్మ పరిశ్రమలోకి అడుగుపెట్టి 8 ఏళ్లు కావొస్తున్నా ఇంత వరకు సరైన హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో కలిసి భర్త మహశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంపైనే డింపుల్ హయతి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డింపుల్ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని తన నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పి షాకిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే...

గల్ఫ్ మూవీతో వెండితెరపై
డింపుల్ హయతి... తొలుత గల్ఫ్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టారు. అయితే హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గద్ధల కొండ గణేష్‌ మూవీలో స్పెషల్ సాంగ్‌తో డింపుల్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత యూరేకా, ఖిలాడీ, రామబాణం తదితర సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అటు తమిళ్, హిందీ, కన్నడ ఇండస్ట్రీల్లోనూ ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. దీనికి తోడు పోలీస్ ఆఫీసర్‌తో వివాదం ఆమెకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. కొన్నాళ్లు సైలైంట్‌గా ఉన్న డింపుల్ తాజాగా రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటిస్తున్నారు.

Dimple Hayathi s shocking family background linked to Dasari Narayana Rao and Actres Prabha

రవితేజతో మరోసారి జోడిగా
భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డింపుల్ హయతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నటిని అవుతానంటే నవ్వారు
నెక్ట్స్ నేనే శర్వానంద్ గారితో చేస్తున్నా..30 శాతం సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సంక్రాంతి తర్వాత నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్నా దీనిపై తర్వాత చెబుతా. కొత్తగా వచ్చే హీరోయిన్లకు మీరేం చెబుతారని యాంకర్ ప్రశ్నించగా.. ఇప్పుడున్న హీరోయిన్లు సలహాలు తీసుకునే పరిస్ధితుల్లో లేరు. లక్ సంగతి పక్కనపెడితే... ప్రతి ఒక్కరూ మనల్ని తొక్కేయడానికే చూస్తారు. స్కూల్ డేస్ నుంచి కూడా నేను అలాగే ఉన్నాను. నేను నటిని అవుతానంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు జనం నన్ను చూసి సర్‌ప్రైజ్ అవుతున్నారు. మన చుట్టూ ఎవరైతే నెగిటివ్‌గా మాట్లాడుతున్నారో, అదే మనల్ని పుష్ చేస్తుంది అని డింపుల్ అన్నారు.

దాసరి, ప్రభలతో రిలేషన్ అదే
నాకు యాక్టర్ అవ్వాలని తొలి నుంచి ఉంది. మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబమే. నేను ఎప్పుడు చెప్పలేదు. మా తాతగారు దాసరి నారాయణరావు గారని చాలామందికి తెలియదు. మా నానమ్మ ప్రభగారు. ఆవిడ అలనాటి హీరోయిన్. దానవీర శూరకర్ణలో నటించారు. మా అమ్మ, వాళ్ల అక్కచెల్లెళ్లు అంతా నటులే. మలయాళంలో మంచి సినిమాలు చేశారు. వాళ్ల నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఫస్ట్ సినిమాల్లోకి వద్దు వద్దు అన్నా.. తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి ఓకే అన్నారు. నువ్వు ఏం చేస్తావో అది చేయమని నానమ్మ ప్రోత్సహిస్తూ ఉంటారు. మా టైంలో ఇలా ఉండేది కాదని గత అనుభవాలు చెబుతుండేవారు. దానవీర శూరకర్ణలో చిత్రం భళారే విచిత్రం సాంగ్ చాలా ఇష్టం అని డింపుల్ హయతి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు, అలనాటి నటి ప్రభల మనవరాలు అయినా ఇప్పటి వరకు ఎందుకు తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బయటపెట్టలేదు? ఇంత వరకు ఆమె ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X