మరో గోల్డెన్ ఛాన్స్ అందుకోబోతున్న ఖిలాడి బ్యూటీ.. హిట్ కాంబినేషన్ లో న్యూ మూవీ!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోయిన్స్ అయితే భారీ స్థాయిలో పారితోషికాలను డిమాండ్ చేస్తున్నారు. ఓ వర్గం హీరోలకు అయితే హీరోయిన్స్ దొరకడం చాలా కష్టం గా మారిపోయింది. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలు కొన్నిసార్లు చేసిన హీరోయిన్ తోనే మళ్ళీ సినిమాలు చేయాల్సి వస్తోంది. ఇక ప్రేక్షకుల్లో రెండవ సారి అదే జోడిని వెండితెరపై చూడాలి అంటే అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎప్పటికప్పుడు కంటెంట్ లోనే కాకుండా కాంబినేషన్ లో కూడా కొత్తగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం కొత్త వారికి అది అడ్వాంటేజ్ గా మారింది. ఇక టాలెంట్ ఉన్న బ్యూటీలకు మంచి అవకాశాలు వస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రేంజ్ అందుకున్న హీరోయిన్స్ అయితే ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచుతున్నారు. అలాంటి వారికి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం స్టార్ హీరోలతో అవకాశాలు అందుకునే విధంగా ముందుకు సాగుతోంది. ఇక ఖిలాడీ భామ డింపుల్ హయాతి పేరు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఖిలాడి సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ సినిమాలో నటించినందుకు అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. ఆమె గ్లామర్ ప్రజంటేషన్ కూడా అద్భుతంగా ఉంది అని ఓ వర్గం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది దర్శకులు నిర్మాతలు కూడా డింపుల్ హయాతి నీ సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ బ్యూటీకి మరొక మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

dimple hayati another golden chance with tollywood action hero,

మాస్ యాక్షన్ హీరో గోపీచంద్ చేయబోయే కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ దర్శకుడు శ్రీవాస్ , గోపిచంద్ తో చాలా కాలం తర్వాత మరో సినిమా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇది వరకే వీరి కలయికలో లక్ష్యం అనే సినిమా వచ్చింది. ఇక మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మంచి సినిమాతో రావాలి అని సిద్ధమవుతున్నారు. ఇక ఆ సినిమాలో డింపుల్ హయాతి ని ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్. దాదాపు ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్టు పనులు కూడా సిద్ధం అయ్యాయి.

ఇక దర్శకుడు ప్రస్తుతం నటీనటులను ఫైనల్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక హీరోయిన్ గా డింపుల్ హాయతిని ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. మరో హీరోయిన్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గోపీచంద్ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అతను చివరగా చేసిన సీటీమార్ సినిమా కూడా అనుకున్నంతగా క్లిక్కవ్వలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు శ్రీవాస్ తో యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో అయినా బాక్సాఫీస్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X