Dimple Hayathi: "ఇప్పటి వరకు నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదు.. ప్లీజ్.. ప్లీజ్ ప్రపోజ్ మీ"
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ డింపుల్ హయతి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ 2017లో గల్ఫ్ అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. అప్పటి నుంచి చాలానే సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ వస్తున్న అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు తనకు ఎవరూ ప్రపోజ్ చేయలేదని చెప్పింది. అలాగే ప్లీజ్, ప్లీజ్ ఎవరైనా ప్రపోజ్ చేయండి అంటూ బతిమాలింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2017లో గల్ఫ్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయతి.. ఆ తర్వాత యురేక సినిమాలోనూ నటించింది. ముఖ్యంగా 2019లో దేవీ 2 అనే సినిమాతో తమిళ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దలకొండ గణేష్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇక 2021లో ఆత్రింగి రే అనే హిందీ సినిమా చేసి బాలీవుడ్ లోనూ కాలుమోపిందీ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత సామాన్యుడు, ఖిలాడి, రామబాణం వంటి చిత్రాలు కూడా చేయగా.. అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకోకపోయినా.. ఈ ముద్దుగుమ్మ అందాలకు తెలుగు ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. ఈమె సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తనకు సంబంధించిన అనేక విషయాల గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తనకు కాబోయే భర్త.. తాను చేసుకునేది ప్రేమ పెళ్లి, ఆరెంజ్డ్ మ్యారేజీయా వంటి విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
డింపుల్ హయతి... ఇప్పటి వరకు నాకు ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదని చెప్పింది. ఇది విన్న యాంకర్ షాక్ అయి అబద్ధం చెబుతున్నారని అనగా... ప్లీజ్ రా ఎవరైనా ప్రపోజ్ చేయండి.. ప్లీజ్.. ప్లీజ్ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఈజీగా ఒప్పుకుంటారని.. కానీ తన తాతయ్యకు మాత్రం లవ్ మ్యారేజీ అంటే అస్సలే నచ్చదు అని వివరించింది. అందుకే తాను ప్రేమ పెళ్లి చేసుకోవడానికి అస్సలే ఇష్టపడను అని తెలిపింది.

తనకు చిన్నప్పటి నుంచి తాతయ్య అంటే చాలా ఇష్టం అని.. ఆయనను బాధ పెట్టడం తనకు అస్సలే ఇష్టం లేదని వివరించింది. అందుకోసం అయినా తాను లవ్ మ్యారేజీ చేసుకోనని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఎలాంటి వాడు కావాలి అని యాంకర్ అడగ్గా... ఏమో నేనా విషయం గురించి ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. కానీ యాంకర్ మాత్రం, యాక్టర్, బిజినెస్ మేన్.. ఇలా ఎవరు కావాలంటూ ప్రశ్నించగా... నాకు తెలీదు, నాకు తెలీదు అంటూ కామెంట్లు చేస్తూనే వచ్చింది.


Click it and Unblock the Notifications











